లాస్టియర్ ‘మజిలీ, వెంకీమామ’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు అక్కినేని హీరో నాగచైతన్య. ఆ ఉత్సాహంతోనే ఈ ఏడాది వరుస సినిమాల్ని లైన్ లో పెట్టుకున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంతో సాయిపల్లవి కథానాయికగా ‘లవ్ స్టోరీ’ అనే ప్రేమకథా చిత్రంలో నటిస్తోన్న చైతూ.. అదే చేత్తో విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. సినిమాకి ‘థాంక్యూ’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఫిక్స్ చేశారు. మొన్నీ మధ్యే సినిమా లాంఛ్ అయింది.
తాజా సమాచారం ప్రకారం ఇందులో చైతూ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారట. డిసెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్ళబోతున్న ‘థాంక్యూ’ సినిమాలో ఒక హీరోయిన్ గా అందాల రకుల్ ప్రీత్ సింగ్ ఫిక్సయిందని సమాచారం. అయితే దీనిపై ఇంతవరకూ అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. అలాగే మరో హీరోయిన్ గా నానీ ‘గ్యాంగ్ లీడర్’ బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్ ను ఎంపిక చేయబోతున్నారని టాక్. ఇక త్వరలోనే మరో హీరోయిన్ ను ఎంపిక చేయబోతున్నట్టు తెలుస్తోంది.
అయితే ఇంతవరకూ ఏ హీరోయిన్ పేరునూ పరిశీలించలేదు. త్వరలోనే మూడో హీరోయిన్ ను ‘థాంక్యూ’ టీమ్ అన్వేషించనుందట. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తోన్న ‘థాంక్యూ’ మూవీ వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభం కానుందని సమాచారం. ‘దడ, యుద్ధం శరణం, దోచేయ్, సవ్యసాచి’ మూవీస్ తర్వాత నాగ చైతన్య నటిస్తోన్న థ్రిల్లర్ మూవీ ఇదే కావడం విశేషం. మరి థాంక్యూ నాగచైతన్యకి ఏ రేంజ్ లో సక్సెస్ తెచ్చిపెడుతుందో చూడాలి.











