‘సుబ్రహ్మణ్య పురం, ఇదం జగత్’ చిత్రాలతో తన స్టైల్ మార్చిన సుమంత్ .. ఇప్పుడు మరోసారి ఆ రూట్లోనే ట్రావెల్ అవుతున్నాడు. తాజాగా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో అతడు నటించిన తాజా చిత్రం ‘కపటధారి’.. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. 70ల్లో జరిగిన ఒకేకుటుంబానికి చెందిన ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ హత్యకేసులో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇన్వాల్వ్ అవుతాడు. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? దానికి వెనకాల ఎవరెవరు ఉన్నారు అనే అంశాలు ప్రేక్షకుల్ని భలేగా థ్రిల్ చేస్తాయి. కవలుదారి అనే సూపర్ హిట్ కన్నడ మూవీకి ఈ సినిమా రీమేక్ వెర్షన్. ఇదే సినిమా తమిళంలో ‘కబడదారి’ గా రీమేక్ అవుతోంది. సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరో.
త్వరలోనే ‘కపటధారి’ చిత్రం విడుదలవుతోన్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను ఈ మధ్యనే విడుదల చేశారు మేకర్స్. టీజర్ ప్రామిసింగ్ గా ఉండడంతో తెలుగులో కూడా ఈ సినిమా మ్యాజిక్ చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. దానికి తోడు ఈ టీజర్ యూ ట్యూబ్ లో ఏకంగా 1మిలియన్ వ్యూస్ ను టచ్ చేసి అందరికీ షాకిచ్చింది. అడుగడుగునా ఉత్కంఠతను రేకెత్తించే విధంగా కట్ చేసిన టీజర్ లో సుమంత్ పలికే డైలాగ్స్ కూడా ఆత్రుతను పెంచుతున్నాయి. టీజర్ తో అంచనాలు మరింతగా పెంచేసిన ‘కపటధారి’ చిత్రం సుమంత్ కు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.











