ఈమధ్య కాలంలో వైరలిజం ఎక్కువైంది. ఏదో ఒకటి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం, దాన్ని మిగతా వారంతా షేర్ చే గాయడం సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా తారక్ ఫొటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. అందులో ఎన్టీఆర్ చొక్కా లేకుండా కనిపిస్తున్నారు. ఇది ఎప్పటి ఫొటోనో తెలియదు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ డబ్బో రత్నాన్ని దీన్ని షేర్ చేశారు. అతను అంతకుముందు ‘అరవింద సమేత’కు ఫొటో షూట్ చేశారు. తాజాగా ఈ పిక్ ను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో తారక్ అభిమానుల్లో ఉత్సుకత పెరిగిపోయింది.
మరో పక్క ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించి టీజర్ మరో మూడు రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ తరుణంలో ఈ ఫొటో విడుదల చేయడంతో అందరి దృష్టీ దీని మీద పడింది. దీని ద్వారా డబ్బో రత్నాని ఏం చెప్పదలుచుకున్నాడో అర్థం కాలేదుగానీ అభిమానులు మాత్రం ఏదేదో ఊహించుకుంటున్నారు. ఒకవేళ ఇది కొమరం భీమ్ కోసం కాదుగదా.. అనే అనుమానం కలిగినా భీమ్ గెటప్ ఇది కాదన్నది అందరికీ తెలుసు. ఇది అరవింద సమేత కోెసం తీసిన ఫొటోయేనట.
👍🏻👍🏻🤗👌🏼💯🤍✨ #btswithdabboo @tarak9999 @DabbooRatnani 📸 @ManishaDRatnani #25yearsofdabbooratnani #JrNTR #DabbooRatnani @Dabboo pic.twitter.com/Qi73Z9INd3
— Dabboo Ratnani (@DabbooRatnani) October 18, 2020











