నిజమా..? రాష్ట్ర స్థాయిలో ఓ మంత్రిగా కొనసాగుతున్న నారా లోకేశ్ ను,,, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాపీ కొడుతున్నారా?. ప్రముఖ మీడియా సంస్థ టీవీ5 చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బీఆర్ నాయుడు) సంధించిన ట్వీట్ ఈ మాట నిజమేనని చెబుతోంది. గత ఎన్నికలకు ముందు టీడీపీ శ్రేణులపైకక్షపూరితంగా వ్యవహరించేవారి పేర్లను గుర్తుంచుకుంటామని, అందుకోసం ఓ రెడ్ బుక్ ను రాస్తున్నానని నారా లోకేశ్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాాగా వైసీపీ నేతలతో జరిగిన సమావేశంలో లోకేశ్ రెడ్ బుక్ ను ప్రస్తావించిన జగన్.. తాము మాత్రం గుడ్ బుక్ రాస్తామంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను క్షణాల్లో పట్టేసిన బీఆర్ నాయుడు ఓ ఆసక్తికరమైన ట్వీట్ ను సంధించారు. ఈ ట్వీట్ వైరల్ గా మారిపోయింది.
తన మీడియా సంస్థ వ్యవహారాలు తప్పించి… పెద్దగా బయటకు రా బీఆర్ నాయుడు… ఇటీవలే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఏడాది జూలైలో ట్విట్టర్ లో ఖాతా తెరచిన నాయుడు… అంతగా యాక్టివ్ గా అయితే లేరనే చెప్పాలి. ఇప్పటిదాకా 7 ట్వీట్లు పోస్ట్ చేసిన ఆయన వాటిలో కేవలం రెండంటే రెండింటిలోనే రాజకీయ అంశాలను ప్రస్తావించారు. ఆ రెంటిలో బుధవారం సాయంత్రం నాయుడు చేసిన ట్వీట్ వైరల్ గా మారిపోయింది. సదరు ట్వీట్ లో ఒక్క అక్షరాన్ని కూడా వాడని నాయుడు… ఓ మంచి ఫోటోను మాత్రమే పొందుపరిచారు. అందులో జగన్… మంత్రి నారా లోకేశ్ ను కాపీ కొడుతున్నట్లుగా నాయుడు వర్ణించారు.
బీఆర్ నాయుడు ట్వీట్ వివరాల్లోకి వెళితే… నారా లోకేశ్ ను ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ గా నాయుడు చూపించారు. అదే సమయంలో జగన్ ను రెండో బెంచిలో కూర్చుని..లోకేశ్ పేపర్లను కాపీ కొడుతున్న విద్యార్థిగా చిత్రీకరించారు. అంతేకాకుండా సూటూ బూటు వేసుకుని దర్పం ఒలకబోస్తున్న విద్యార్థిగా లోకేశ్ ను చూపించిన నాయుడు… జగన్ ను మాత్రం సాదాసీదా విద్యార్థిగా చూపించారు. అంతేకాదండోయ్.. సదరు ఫొటోలో.తరగతి గదిలోని విద్యార్థులంతా జగన్ మాదిరే స్కూల్ యూనిఫాంలతో కనిపించగా…లోకేశ్ మాత్రం ఓ కార్పొరేట్ సంస్థకు యజమాని అన్నంతగా నాయుడు చూపించారు. ొక్కటంటే ఒక్క అక్షరాన్ని కూడా వాడకుండా కేవలం కేరికేచర్ తోనే నాయుడు సంధించిన ఈ ట్వీట్ మాత్రం అమితాసక్తి రేకెత్తిస్తోంది.











