విజయవాడలో ఓవైపు ప్రజలు వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, మాజీ సీఎం జగన్ మాత్రం నీచ రాజకీయాలకు తెగబడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రుళ్లు నిద్రపోకుండా సమీక్షలు, వరద బాధితులకు అందుతున్న సాయం, ముంపు ప్రాంతాల పరిశీలనతో తీరిక లేకుండా ఉంటున్నారు. వరద బాధితులకు తక్షణ సాయం అందించడంలో చంద్రబాబు సమర్థతను బాధితులే మెచ్చుకుంటున్నారు. అలాంటి సమయంలో జగన్ సరికొత్త ఫేక్ ప్రచారానికి తెరలేపారు. చంద్రబాబు తాను ఉంటున్న ఇంటిని కాపాడుకునేందుకు యత్నించడం వల్లనే విజయవాడకు వరదలు వచ్చాయని జగన్ అర్థం లేని వాదనను తెరపైకి తెచ్చారు.
విజయవాడ నగరానికి నైరుతి దిక్కులో బుడమేరు ఉంటే చంద్రబాబు ఇల్లు ఈశాన్యంలో ఉంది. ఈశాన్యంని అనుకుని కృష్ణా నది ఉంది. బుడమేరు అనేది కాలువ.. కృష్ణా అనేది నది.. వాటి ప్రవాహ మార్గాలు వేరు వేరు. అసలు అవి రెండూ కలిసే అవకాశమే లేదు. అయినా సరే, కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని కాపాడుకునేందుకు బుడమేరుకు నీటిని విడుదల చేశారంటూ పులివెందుల ఎమ్మెల్యే జగన్ వాదనకు తెరలేపారు.
పైగా బుడమేరు కాలువలో గేట్లు పెట్టాలి అంటున్నారు జగన్. ఒక డ్రెయిన్ లో గేట్లు ఎలా పెట్టాలో అనే ఆలోచన కూడా లేదు. సింగ్‌నగర్ పర్యటన సందర్భంగా సోమవారం మీడియాతో జగన్ మాట్లాడుతూ.. కరకట్టపై చంద్రబాబు ఇంటిని రక్షించేందుకే విజయవాడలోని ఈ ప్రాంతాన్ని నీటిమయం చేశారని అర్థం లేకుండా వాగారు. తాను ప్రతి ప్రశ్న లాజికల్‌గా అడుగుతున్నానని గొప్పలు చెప్పుకున్నారు. కృష్ణానదికి గరిష్ఠంగా 11.43 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చిందని.. బుడమేరుకు వచ్చిన వరద 35 వేల క్యూసెక్కులే అని అన్నారు. అంటే 35 వేల క్యూసెక్కులను ఆపితే కృష్ణా నదికి వచ్చే వరదంతా ఆగిపోతుందా అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. మరీ ఈ లాజిక్ లేకుండా జగన్ ఇదేం దిక్కుమాలిన లాజిక్ తో మాట్లాడారో ఆయనకే అర్థం కావాలి.
సాధారణంగా జగన్ గాల్లో తిరుగుతూ ఉంటారు. రోడ్ల మీద ప్రయాణించడం చాలా తక్కువ. తక్కువ దూరాలకే హెలికాప్టర్లు వాడతారు. అలా ఎక్కడో గాల్లోనో లేదా నేలమీద రెడ్ కార్పేట్లు వేసుకుని తిరిగే జగన్.. చంద్రబాబు నిన్న బురదలోకి దింపారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇలా సబ్జెక్టు తెలియకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఇప్పటికే 11 సీట్లు ఇచ్చి తాడేపల్లికి బెంగళూరు కి పరిమితం చేశారు.. ఇది ఇలానే అడ్డగోలుగా మాట్లాడితే చివరికి ఎక్కడికి చేరాలో అక్కడికి ప్రజలే చేర్చుతారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. బురదలోకి దిగి నాలుగు ఫోటోలు దిగి ఇంటికి వెళ్లి స్టీమ్ బాత్ చేయించుకోక.. నీకెందుకు ఈ తిప్పలు అంటూ ఎద్దేవా చేస్తున్నారు.