టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రచించి, అమలు చేస్తున్న వ్యూహాలతో విపక్ష వైసీపీలో నిజంగానే వణుకు పుడుతోందని చెప్పాలి. లోకేశ్ శిబిరం నుంచి వరుసగా విరుచుకుపడుతున్న బాంబుల్లాంటి ప్లాన్లతో ఇప్పటికే వైసీపీ బిక్కచచ్చిపోయింది. లోకేశ్ అండ్ కో సంధించిన బానాలకు ఇప్పటికే చాలా మంది వైసీసీ నేతలు ఆ పార్టీకి దూరం జరిగిపోయారు. మరికొందరు ఏకంగా అండర్ గ్రౌండ్ కే వెళ్లిపోయారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దా*డి లాంటి ఘటనల్లో కీలక నిందితులుగా ఉన్న వారు వారికి వారే లొంగిపోతున్న వైనం కూడా చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. లోకేశ్ అనుసరిస్తున్న వైఖరిని చూసే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తన వ్యూహాలను ఒక్కసారిగా పక్కనపెట్టేసి… తనకు దూరంగా జరిగిన చెల్లి షర్మిలతో సయోధ్య కుదుర్చున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ఆదివారం నారా లోకేశ్ ఎంచక్కా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశారు. ఓ మంత్రిగా రాష్ట్రం బయట పర్యటనలకు సంబంధించిన వివరాలను లోకేశ్ ముందుగానే వెల్లడించాల్సి ఉంటుంది. అయితే ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టేసిన లోకేశ్… ఏ ఒక్కరికి కూడా ముందస్తు సమాచారం లేకుండానే ఆదివారం లోకేశ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. లోకేశ్ ఫ్లైట్ ఎక్కేందుకు బయలుదేరే వరకు ఈ విషయం ఆయన అంతరంగి బృందానికి కూడా తెలియదట. ఢిల్లీ వెళ్లిన లోకేశ్ నేరుగా బీజేపీ కీలక నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షా నివాసంలో వీరిద్దరి భేటీ సుమారుగా 40 నిమిషాలకు పైగానే సాగింది. వాస్తవానికి ఆదివారం అమిత్ షా ఎలాంటి అధికారిక కార్యక్రమాలకు హాజరు కారు. ఈ లెక్కన లోకేశ్ తో ఆయన భేటీ రాజకీయ ప్రాధాన్యమైనదనే చెప్పాలి. మరి ఈ రాజకీయాలే ప్రాధాన్యంగా జరిగిన ఈ భేటీలో వారి మధ్య ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్నది ఆసక్తికరంగా మారింది.
అమిత్ షాతో లోకేశ్ భేటీ ముగియగానే… రాష్ట్రంలో తాజా రాజకీయ .పరిస్థితులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పెట్టుబడుల రాక కోసం చేపడుతున్న చర్యలు, కేంద్రం నుంచి తామేమి ఆశిస్తున్నామన్న అంశాలను లోకేశ్ ప్రస్తావించారని ఆయన బృందం తెలిపింది. అదే సమయంలో లోకేశ్ చెప్పినదంతా సావదానంగా విన్న అమిత్ షా… కేంద్రం నుంచి రాష్ట్రానికి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలిపింది. ఈ విషయాలు వారి భేటీలో తప్పనిసరిగానే ప్రస్తావనకు అయితే వచ్చి ుంటాయి గానీ…వాటితోనే బేటీ ముగిసి ఉంటుందా? అంటే… కాదనే అంటున్నాయి కొన్ని వర్గాలు. ఎందుకంటే.. కూటమి సర్కారు పాలన మొదలుపెట్టాక ఏపీలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. కూటమి సర్కారు దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ విషయాలన్నింటినీ అమిత్ షాకు లోకేశ్ వివరించి ఉంటారని ఆ వర్గాలు అంటున్నాయి.
మొన్నటి ఎన్నికలకు ముందు రెడ్ బుక్ రాస్తున్నానంటూ లోకేశ్ పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగానే టీడీపీ కూటమి సర్కారు అధికారంలో రావడంతో లోకేశ్ తన రెడ్ బుక్ ను అమల్లోకి తీసుకొచ్చేశారు. అయితే ఎక్కడ కూడా చట్టాన్ని ఉల్లంఘించి ప్రత్యర్థులపై చర్యటకు పాల్పడుతున్న దాఖలా కనిపించడం లేదు. తప్పు చేసిన అధికారులు అయినా, వైసీపీ నేతలు అయినా.. వారిపై చట్టపరంగానే చర్యలు తీసుకోవడం మొదలైపోయింది. ఈ క్రమంలో పలు కీలక కేసుల్లో త్వరలోనే వైసీపీకి చెందిన కొందరు కీలక నేతలు తప్పరిసరిగా అరెస్ట్ కాక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దిశగా ఇప్పటిదాకా తాము తీసుకున్న చర్యలు, సమీప భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యల గురించి అమిత్ షాకు వివరించి… తదుపరి చర్యల కోసం ఆయన నుంచి అనుమతి తీసుకునేందుకే లోకేశ్ ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారని వినికిడి. ఈ విషయాలన్ని సైలెంట్ గానే పరిశీలిస్తున్న వైసీపీ శిబిరం వణికిపోతోందట.