వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అరెస్టుకు రంగం సిద్ధమయిందా. జూన్ నెలలో అరెస్టుకు ముహూర్తం ఫిక్స్ అయిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జూన్ 10లోపు జగన్ అరెస్టు ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే సిట్ విచారణ ఫైనల్ స్టేజ్‌కు చేరడం, ఈ కేసులో ఇప్పటివరకూ అరెస్టయిన వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలం, సేకరించిన ఆధారాల మేరకు లిక్కర్ స్కామ్‌లో అంతిమ లబ్ధిదారు జగనేనని సిట్ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్‌ను అరెస్టు చేయబోతున్నారని తెలుస్తోంది.
ఇక జగన్‌కు అత్యంత సన్నిహితుడు, వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి సైతం సన్నిహితుల దగ్గర ఇదే విషయాన్ని చెప్పినట్లు సమాచారం. జూన్ 10లోపు జగన్‌ను అరెస్టు చేయబోతున్నారని ఇటీవల తిరుపతి పర్యటనలో సన్నిహితులతో విజయసాయి చెప్పినట్లు అభిజ్ఞవర్గాల సమాచారం. ఇటీవల వైసీపీపై, జగన్‌పై ఘూటుగానే స్పందిస్తున్నారు విజయసాయి. జగన్‌కు నష్టం చేయాలని పార్టీలోనే కొందరు భావిస్తున్నారని ట్వీట్ కూడా చేశారు.
ఇటీవల మాజీ మంత్రి పేర్ని నాని సైతం జగన్ అరెస్టుపై వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో జగన్‌ను ఏ క్షణమైనా అరెస్టు చేయబోతున్నారని నానినే స్వయంగా చెప్పారు. దీంతో వైసీపీలోనూ జగన్ అరెస్టుపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. జగన్ అరెస్టయితే ఎలాంటి కార్యక్రమాలు చేయాలనేదానిపై ఇప్పటికే వైసీపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.
లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డితో పాటు పలువురు అరెస్టయ్యారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలు అరెస్టయ్యారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. బుధవారం రాజ్ కసిరెడ్డిని దాదాపు 10 గంటల పాటు ఈడీ విచారించింది. ఈ నేపథ్యంలోనే జగన్ అరెస్టు ఖాయమని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జోరందుకుంది.