ఆంధ్ర ప్రదేశ్ నీటిపారుదల శాఖా మంత్రి అంబటి రాంబాబు పై ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యాడని తెలుస్తోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాయలసీమ జిల్లాలో ప్రోజెక్టుల టూర్ మీద వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు..
అయితే చంద్రబాబు నాయుడు అడుగుతున్న ప్రోజెక్టుల ప్రోగ్రెస్ మీద ఆశాఖా మంత్రివర్యులు సమాధానం చెప్పకుండా ముఖం చాటేస్తున్నారు. ఈ విషయమై జగన్ రెడ్డి అంబటి రాంబాబు కి వార్నింగ్ ఇచ్చిన్నట్టు తెలుస్తోంది.
ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుండగా ఆ శాఖ మంత్రి అంబటి బ్రో సినిమా గురించి మాట్లాడారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్ ఎప్పుడు, ఎక్కడ పూర్తి చేసారు, ఎన్ని వేళా ఎకరాలకు నీరుఅందిస్తున్నారు అని చంద్రబాబు నిలదీసాడు. .
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ అంగడిలో సరుకు అంటూ సోషల్ మీడియాలో జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో’ సినిమా విడుదలైనప్పటి నుంచి శ్యాంబాబు పాత్రపై మంత్రి అంబటి రాంబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదలైన తర్వాత అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేసిన మంత్రి రాంబాబు తాజాగా ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ విషయంలో జగన్ అంబటి రాంబాబు మీద కోపంగా ఉన్నారని సమాచారం..