ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు సీమ టూర్ అని అనౌన్స్ చేసాడో అప్పటి నుండి వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వైసీపీకి , అలాగే సీఎం జగన్ మోహన్ రెడ్డికి కంచుకోటగా పేరుగాంచిన పులివెందుల గడ్డ మీద చంద్రబాబు నాయుడు సింహంలా గర్జించాడు.
చంద్రబాబు నాయుడు సీఎం జగన్ మోహన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు, జగన్ సొంత నియోజకవర్గంలో సవాలు విసిరారు. సీమ జిల్లాలకు జగన్ ఏమి చేసాడో చెప్పాలని, సీమ ప్రజల అమాయకత్వంతో జగన్ ఆటలాడుతున్నాడని ఎద్దేవా చేసాడు..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పులివెందుల ప్రజలకు సంచలన హామీలు ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ రతనాల సీమ అవుతుందన్నారు. హార్టికల్చర్ హబ్‌గా మారుస్తాం. పాత పంటల బీమాతో రైతులను ఆదుకుంటామన్నారు. ప్రతి ఎకరాకు నీరు అందిస్తామన్నారు.
గోదావరి నుంచి బానకచర్లకు నీరు తీసుకురావడమే తన జీవిత ఆశయమని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గండికోటలో రాయల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. నల్లమలలో 32 కి.మీ. టన్నెల్ ద్వారా బానకచర్లకు నీరు ఇస్తామన్నారు. రాయలసీమలోని అన్ని ప్రాంతాలకు బానకచర్ల ద్వారా నీరు అందుతుందని చంద్రబాబు అన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ వైభవం వల్లే పులివెందులకు హైవే వస్తోందని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు.
సీమ జిల్లాలో వైసీపీ వాష్ ఔట్ కావడం పక్క అని తెలుస్తోంది. ఎప్పుడు లేంలేని విధంగా రాయలసీమలో చంద్రబాబు నాయుడుకి ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ఈ దెబ్బతో సీమలో సైకిల్ టాప్ గేర్లోకు వచ్చేసింది. అదే సమయంలో సీమ ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఫ్యాన్ రెక్కలు ఊడిపోవడం ఖాయమని తెలుస్తోంది.