వైసీపీలో ఆ మహిళ ఎంపీ తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏకంగా పార్టీ చీఫ్ జగన్ సైతం ఆ ఎంపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 4 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది. వీటిలో మూడు స్థానాలు రాయలసీమలోని కడప, రాజంపేట, తిరుపతి కాగా….ఉత్తరాంధ్రలోని అరకు స్థానంలో వైసీపీ అభ్యర్థి తనూజ రాణి ఎంపీగా గెలిచారు. ఐతే ఇప్పుడు తనూజ రాణి వ్యవహార శైలి హాట్ టాపిక్‌గా మారింది.
తనూజ రాణి కీలక కూటమి పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గతేడాది నుంచే ఆరోపణలు వచ్చాయి. ఐతే అప్పట్లో వైసీపీ పెద్దలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆమె కొద్దికాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతే కాదు కూటమిలోని ఓ కీలక పార్టీకి సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. ఇది వైసీపీకి మింగుడు పడడం లేదు. దీంతో జగన్ ఆమెపై సీరియస్ అయినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తనూజ రాణి తొలిసారి ఎంపీ కావడంతో పార్టీ గీత దాటదని వైసీపీ నేతలు భావించారు. కానీ గతంలో…ఓ మహిళా ఎంపీ కూడా ఇదే తరహాలో వ్యవహరించిన నేపథ్యంలో వైసీపీ అలర్ట్ అయింది. అంతే కాదు..తాజాగా వెలుగు చూసిన సమాచారం మేరకు..జగన్‌ను ధ్వేషించే ఓ మాజీ మహిళా ఎంపీనే ఇప్పుడు తనూజా రాణిని రాజకీయంగా ఎంకరేజ్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే జగన్ తనూజ రాణిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. తనకు అలవాటైన భాషలో నీతీరేంది సామీ..అంటూ ఆమెను ప్రశ్నించారని సమాచారం. ఇక ఇప్పుడు వైసీపీ చేపట్టిన ఇంటింటి క్యాంపెయిన్‌లోనూ ఆమె ఎక్కడా కనిపించడం లేదని టాక్. దీంతో ఎక్కడున్నావ్, ఏ పార్టీలో ఉన్నావ్, ఏం చేస్తున్నావ్ అంటూ జగన్ గట్టిగానే ప్రశ్నించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.











