చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో సీన్ రివర్సవడంతో అసంతృప్తి, అభద్రత, అసహం పెరిగిపోతున్న జగన్ ఎప్పుడే నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కాక అందరూ తలలుపట్టుకుంటున్నారు. ఆయనలోని విపరీత ధోరణితో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని పార్టీ నేతల సైతం కంగారుపడుతున్నారు.
చంద్రబాబును రాజమండ్రి జైల్లో యువ నేత లోకేశ్ కలవడం ఆయన తక్షణం ఢిల్లీ వెళ్లి అక్కడ పలువురు
నేతలను, బీజేపీ అగ్రనేతలను కలవడం జగన్‌కు ఏ మాత్రం మింగుడుపడలేదు. వైసీపీ ఊహించని ఈ పరిణామంతో
లోకేశ్ ఇమేజ్ బ్రహ్మాండంగా పెరిగిపోయింది. వెనుక జనసేనాని పవన్ కళ్యాన్ అండతో లోకేశ్ సీనియర్ పొలిటియన్
రేంజ్‌కు ఎదిగిపోయారు. తెలుగుదేశం పార్టీకి దిక్కులేదన్న విమర్శకుల నోళ్లు మూయించేలా మొదటి సారి
ఢిల్లీ పర్యటనలో న్యాయవాదులను, రాజకీయ నేతలను కలిసిన లోకేశ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు సైతం
అసలేం జరిగిందో వివరించారు. లోకేశ్ ప్రయత్నాలతో చంద్రబాబు కేసుల వ్యవహారంలో సుప్రీం కోర్టులో
విజయవంతంగా తమ వాదనలను వినిపించగలిగామన్న అభిప్రాయంతో టీడీపీనేతలున్నారు.
అయితే శనివారం రాజమండ్రి జైల్లో మరో సారి చంద్రబాబును కలిసిన లోకేశ్ మళ్లీ ఢిల్లీ బయల్దేరారు. దీంతో
జగన్ బ్యాచ్ అలర్టయింది. లోకేశ్ ఢిల్లీ టూర్‌పై నిఘా పెట్టాలని నిర్ణయించింది. యువ నేత ప్రతి కదలికపైనా
ఫోకస్ పెట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మొదటి సారి ఢిల్లీ వెళ్లిన లోకేశ్ సాధించిన ఇమేజ్ వైఎస్సార్‌సీపీకి
మింగుడుపడటం లేదు. దీంతో ఇలాంటి విపరీత నిర్ణయాలు తీసుకుంది.
చంద్రబాబును అరెస్ట్ చేయించడం ఓ ఎత్తైతే లోకేశ్ వ్యూహాలకు కౌంటర్ వేయటం మరో ఎత్తులా వైసీపికి మారింది. దీంతో అన్ని విధాలుగా లోకేశ్ ఢిల్లీ టూర్ పై దృష్టి పెట్టాలని యోచిస్తోంది. ఈ సారి ఢిల్లీ పర్యటనలో ఎవరెవరిని లోకేశ్ కలవనున్నారు.. వంటి అంశాలను తెలుసుకుని మరో కుట్రకు తెరతీయవచ్చని వైసీపీ ఆలోచన.











