చంద్రబాబును అరెస్ట్ చేయించి తెగ సంబరపడిపోతున్న జగన్ ఢిల్లీ పర్యటనలో ఊహించని పరిణామాలు ఎదుర్కొన్నాడు. మిత్రపక్షమే లేకుండా చేసి ఎన్నికలకు వెళ్లి మరో సారి అధికారం చేపడదామనుకున్న జగన్ రెడ్డి ఆశలు నీరుగారిపోతున్నాయి. కేంద్రాన్ని నమ్ముకుని ముందస్తుకు వెళదామనుకున్న జగన్ వ్యూహం ఘోరంగా దెబ్బతిన్నది. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు
తెలుగుదేశంతో పొత్తు ప్రకటించిన జనసేన జగన్‌కు మొదటి షాక్ ఇచ్చింది.
ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్ కోసం జగన్ ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది.. వైసీపీ ప్రస్తుతం గడ్డు స్థితిలో ఉంది.. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తన సర్వేలో తేలిందని తెలిపారు.. ఇటు, పలు సర్వేలు సైతం ఈ దఫా ఎన్నికలలో సైకిల్ జోరు తప్పదని తేల్చి పారేస్తున్నాయి.. ఇటు, తన సొంత ఐప్యాక్ సర్వేలలోనూ జగన్ సర్కార్‌పై వ్యతిరేకత ఉందని కుండబద్దలు కొడుతున్నాయనే లీకులు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి.. అందుకే, వ్యూహాత్మకంగా. టీడీపీ అధినేత జైలులో ఉంటే.. తాను ఎంతో ఈజీగా ఎన్నికల గోదాని ఈదేయవచ్చునని భావించిన జగన్‌కి.. కేంద్ర పెద్దలు హ్యాండ్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది..
జగన్ ఢిల్లీ పర్యటనలో అంతకంటే ఊహించని షాక్ ఎదుర్కొనాల్సి వచ్చింది. చంద్రబాబు అరెస్ట్‌తో కేంద్రం అండతో ఏదైనా చేయచ్చనుకున్న జగన్‌కు ఢిల్లీ పెద్దలు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రధానంగా చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయించాల్సి వచ్చిందన్న పాయింట్ నుంచి మొదలుపెట్టి జగన్ మూర్ఖపు నిర్ణయాలను ఢిల్లీ బీజేపీ పెద్దలు, మంత్రులు ఏకిపారేశారట. దాదాపుగా ఢిల్లీ పర్యటనలో వెళ్లిన చోటల్లా ఇదే పరిణామాలు ఎదురయ్యాయి.
ఇక చంద్రబాబు జైల్లో ఉండగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న జగన్ ఆలోచనకు మోదీ టీమ్ మైండ్
బ్లాంక్ అయ్యే షాకిచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎదురయ్యే పరిణామాలను జగన్ వివరిస్తున్నప్పటికీ మోదీ టీమ్ సభ్యులెవరూ పట్టించుకోలేదట. పైగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలుగుదేశం బలం అమాంతంగా పెరిగిపోతోందన్న అంశాన్ని కూడా పలువురు బీజేపీ పెద్దలు జగన్ దృష్టికి తీసుకొచ్చారని కూడా ఢిల్లీ మీడియా చెబుతోంది. తెలంగాణలో జరిగే ఎన్నికలతో పాటే నోటిఫికేషన్ ఇవ్వాలని కోరిన జగన్‌కు అధికారులు ఝలక్ ఇచ్చారట. ఇంత శరవేగంగా ఎన్నికల నిర్వహణ ఏపీలో సాధ్యం కాదని తేల్చిపారేశారని సమాచారం. దీంతో జగన్ పెండింగ్ ఫైళ్లు క్లియర్ చేయాలంటూ రొటీన్ గా అధికారులకు, మంత్రులకు వినతులిచ్చి ఢిల్లీ నుంచి తాడేపల్లికి బయల్దేరారు.











