ముందూ వెనుకా ఆలోచించకుండా ఢిల్లీ వెళ్లిన జగన్ కు షాకులు మీద షాకులు తగులుతున్నాయి.
ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం తర్వాత ఎదురైన పరిస్థితులను అంచనా వేయటంలోనూ
విశ్లేషించడంలోనూ జగన్ రాజకీయ అనుభవం సరిపోలేదన్న అభిప్రాయం అందరిలోనూ వ్యవక్తమవుతోంది.
చంద్రబాబును అరెస్ట్ చేయించి సంబరపడుతున్న ఆయన జరుగుతున్న నష్టాన్ని, ఎదురవబోయే ప్రమాదాలను అంచనా వేయలేకపోయారు. ప్రధాని మోడీతో స్నేహ బంధాన్ని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్న వేళ… జగన్ వచ్చే ఎన్నికల్లో తాను గెలవబోయే సీట్ల లెక్కలపై సొంత సర్వే నివేదికలను చంకలో పెట్టుకుని ఢిల్లీకి బయల్దేరారు. ఢిల్లీలో శుక్రవారం జరగనున్న సమావేశంలో ప్రధాని మోడీ, అమిత్ షాలతో ప్రత్యేకంగా జరిగిన సమావేశంలో తన సొంత సంస్థల సర్వేతో పాటు.. ఇటీవల టైమ్స్ నౌ, ఇండియా టీవీలు నిర్వహించిన సర్వేల సారాంశాన్ని కూడా మోదీకి జగన్ వివరించనున్నారని తెలుస్తోంది..
జాతీయ మీడియాలో ఏపీలో అంతటా తనకు అనుకూలంగా, తనకు తిరుగులేదని, మరోసారి రాబోయేది వైసీపీ సర్కారే అనే మూడ్ క్రియేట్ చేయడానికే జగన్ టీమ్.. ముందస్తుగా ఈ సర్వేలని రిలీజ్ చేసిందనే ప్రచారం జరుగుతోంది.. గతంలోనూ జగన్ హస్తిన పర్యటన నేపథ్యంలోనే టైమ్స్ నౌతోపాటు ఆయన అనుకూల మీడియా సర్వేలు రిలీజ్ చేయించిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.. ఆ సర్వేలతో మోదీ – షా టీమ్‌కి ఆయన ఫీల్ గుడ్ ఫీలర్ వ్యాపించేలా చేస్తున్నారని, వాటితో ఏపీలో టీడీపీకి సీన్ లేదనే ప్రచారాన్ని చేయిస్తున్నారని హస్తిన రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.. టీడీపీని టార్గెట్ చేసిన మోదీ టీమ్ సైతం.. జగన్ చెబుతున్న కల్లబొల్లి కబుర్లనే విశ్వసిస్తున్నారనే కథనాలు వెలువడుతున్నాయి..
తాజాగా కేంద్ర ఇంటిలెజెన్స్.. సైతం నిఘా రిపోర్టులు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.. దీంతో, జగన్‌తో ఇకపై అంటీ ముట్టనట్లుగా వ్యవహరించాలా.?? లేదా.? అనే అంశంపై తర్జన భర్జనలు పడుతున్నారట.. ఆంధప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, రావాల్సిన నిధుల అంశాల కంటే రాజకీయా వ్యవహారాలపైనే జగన్ ఎక్కువ ఆసక్తి చూపటం ఢిల్లీ పెద్దలకు అసలు నచ్చలేదు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో తమ ఇమేజ్ కూడా డామేజ్ అవడం ఢిల్లీ బీజేపీ పెద్దలకు ఆగ్రహం తెప్పిస్తోంది. అందుకు భిన్నంగా జగన్ మాట్లాటడం, పైగా తమదే గెలుపంటూ జాతీయ చానెళ్ల సర్వేలు చూపెట్టడంతో మోదీ టీమ్ డిజప్పాయింట్ అవుతున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇవన్నీ సరే.. చంద్రబాబు అరెస్ట్ తరువాత సొంత పార్టీలో పెరుగుతున్న అసమ్మతి, ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేక అభిప్రాయం సంగతేమిటని ప్రధాని ప్రశ్నించనున్నారని సమాచారం.. దీంతో పాటు ఆత్మసాక్షి సంస్థ చేసిన సర్వే రిపోర్టుని కూడా మోదీ టేబుల్ ముందు ఉంచనున్నారని కథనాలు వెలువడుతున్నాయి.. మరి, మోదీ – షా భేటీ తర్వాత ఏపీ రాజకీయాలు ఎలాంటి టర్న్, ట్విస్ట్ తీసుకుంటాయో చూడాలి..