– ఆత్మసాక్షి సర్వేతోపాటు ఇటీవల జగన్ చేయించుకున్న సర్వేలలోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత ఒక రేంజ్‌లో ఉందనేది అక్షరసత్యం.. బాబు అరెస్ట్ తర్వాత సానుభూతి రూపంలో సుమారు 1.5 శాతం ఓటర్లు, ఆరు నుండి ఎనిమిది లక్షల ఓట్లు వైసీపీకి దూరం కానున్నారనే తేలిపోయిందట.. దీంతో, బాబు కేసులపై ఏం చేయాలో జగన్ కన్ ఫ్యూజన్‌లో పడిపోయారట.
చంద్రబాబు, తెలుగుదేశంతో పెట్టుకుంటే ఏమవుతుందో జగన్ ప్రభుత్వానికి, వైసీపీ నేతలకు ఆలస్యంగా అర్థమవుతోంది. అన్యాయంగా, కుట్రపూరితంగా చంద్రబాబును కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేయించిన జగన్
ఇప్పుడు కంటి మీద కునుకులేకుండా గడుపుతున్నాడట. చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరగాల్సింది ఒకటైతే
జరుగుతోంది మరొకటని జగన్ రగిలిపోతూ ఆ ఆగ్రహాన్ని కనిపించిన వారి మీదల్లా చూపెడుతున్నాడని తాడేపల్లి ప్యాలెస్ టాక్.
దశాబ్దాల రాజకీయ అనుభవంతో లక్షల మంది అభిమానులను సంపాదించుకోవటంతో పాటు ముఖ్యమంత్రిగా అపారమైన అనుభవం ఉన్న నేత చంద్రబాబు. అలాంటి నేతను బలవంతగా అరెస్ట్ చేయించాక ప్రజలు వైసీపీపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు ఎదురైతే చాలు తిట్లు అందుకుంటున్నారు. ఏపీ అంతటా ఇదే పరిస్థితి. జగన్ ఇలాంటి పరిస్థితి ఎదరువుతుందని కల్లో కూడా ఊహించి ఉండడు.
చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలపై నివేదికలు, సర్వేలతో అసలు విషయం తెలుసుకున్న జగన్ బ్యాచ్ నోరెళ్ల బెట్టిందట. ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని ఆత్మ సాక్షి సర్వే నివ్వెర పరిచే నివేదిక ఇవ్వడంతో గుండె జారిపోయిన జగన్ ఆ తర్వాత పలు సర్వేల నివేదికలు చూశాక నోట మాట రాకుండా ఉండిపోడని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై సొంత పార్టీ నేతలే అసమ్మతి స్వరం వినిపిస్తుండం, మరికొంత మంది తలో దారీ వెతుక్కునే పనిలో ఉండటంతో జగన్ కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నాడు.
ఇలా ఎందుకయిందో తెలుసుకునే ప్రయత్నాల్లో బీజీగా ఉన్న జగన్‌ను రోజుకో షాకింగ్ న్యూస్ కలవర
పెడుతోంది. అందులో చంద్రబాబుకు సానుభూతి అంతకంతకూ పెరిగిపోతోందన్నది ప్రధానంగా జగన్‌కు
నిద్ర పట్టనివ్వటం లేదు. దీనికి తోడు ఓ రేంజ్ లో ప్రజా వ్యతిరేకత బయటపటడం కూడా వైసీపీని భయపెడుతోంది. బాబు అరెస్ట్ తర్వాత సానుభూతి రూపంలో సుమారు 1.5 శాతం ఓటర్లు, ఆరు నుండి ఎనిమిది లక్షల ఓట్లు వైసీపీకి దూరం కానున్నారనే తేలిపోయిందట.. దీంతో, బాబు కేసులపై ఏం చేయాలో జగన్ కన్ ఫ్యూజన్‌లో పడిపోయారట . పరిస్థితులు ఇలా ఎదురుతిరగడంతో జగన్ బ్యాచ్ గేమ్ ప్లాన్ చేంజ్ చేయాలని డిసైడైంది. చంద్రబాబును ఇంకొన్ని రోజులు జైల్లో ఉంటే ఎదురయ్యే పరిణామాల గురించి వైసీపీ పెద్దలందరూ ఓ కీలక సమావేశం నిర్వహించారట. ప్రజా వ్యతిరేత, చంద్రబాబుపై పెరుగుతున్న సానుభూతి వంటి అంశాలు పరిగణలోకి తీసుకుని రేపో మాపో ఈ కుట్ర సిద్ధాంతాలలకు రాజకీయాలకు తెర దించే ప్రయత్నాలు ఆపాలని పలువురు నేతలు ఆ సమావేశంలో జగన్ కు సూచించారని కూడా విశ్వసనీయ సమాచారం. ఎన్నికల రాజకీయ వెడెక్కిన తరుణంలో ఇలాంటి రాజకీయాలు సరికాదని సొంత పార్టీ నేతలే చెప్పటంతో జగన్ డైలమా రెట్టింపయిందని సమాచారం.











