వైసీపీలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్ర అసహనానికి గురి చేస్తున్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురు కావడం, కనీసం తనకు అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కపోవడం, దాని కోసం తాను దేహీ అని అడుక్కున్నా ఫలితం లేకపోవడం… అదికార పార్టీని నిలదీద్దామంటే చాలీచాలనీ బలం.. ఇలా వరుసబెట్టి ఎదురవుతున్న సమస్యలతో జగన్ సతమతమవుతున్నారు. ఈ సమస్యలతోనే తలబొప్పి కడుతుంటే.. అప్పటిదాకా తనకు నమ్మిన బంటుల్లా కొనసాగిన పార్టీలోని కీలక నేతలు పార్టీని వీడి పోతుండటం జగన్ ను మరింతగా అసహనానికి గురి చేసింది.
ఈ అసహనం ఏ రేంజికి చేరిపోయిందంటే… తోడబుట్టిన వాడు కాకున్నా… అంతకంటే ఎక్కువగా చూసుకుంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని జగన్ లెఫ్ట్ అండ్ రైట్ వాయించేశారట. పార్టీ పెట్టిన నాటి నుంచి అవినాశ్ రెడ్డిని జగన్ ఏనాడూ మందలించిన దాఖలా లేదనే చెప్పాలి. తన సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో అవినాశ్ రెడ్డే కీల భూమి పోషించారన్న ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఆయనను జగన్ పల్లెత్తు మాట కూడా అనలేదు. ఇంకా అవినాశ్ రెడ్డి చిన్న పిల్లోడు అంటూ వెనకేసుకుని వచ్చారు. అలాంటిది ఇప్పుడు కడపలో ఉండి ఏం పీకుతున్నావ్ అంటూ జగన్ ఆయన మీద ఒంటికాలిపై లేచారట.
సీఎంగా ఐధేళ్ల పాటు దిలాసాగా రాజభోగాలు అనుభవించిన తాను ఇప్పుడు అసెంబ్లీలోనే కాలు పెట్టలేని పరిస్థితి వచ్చింది కదా. అలాొంటి పరిస్థితుల్లో తన సొంత జిల్లా… అది కూడా అవినాశ్ రెడ్డి ఎంపీగా ఉన్న కడపలో కార్పొరేటర్లంతా పొలోమంటూ వైసీపీని వీడి టీడీపీలో చేరిపోతుంటే… జగన్ అసహనం పెరగడం సహజమే కదా. అందులోనూ కడప మునిసిపల్ కార్పొరేటర్లంతా… ఏదో జనాల్లో నుంచి వచ్చిన నేతలు కాదాయే. వారంతా అవినాశ్ రెడ్డి చుట్టూ తిరిగి.. ఆయన కరుణ కటాక్షాలతో కార్పొరేటర్లుగా వెలిగిపోతున్న వాారాయే.
ఈ లెక్కన వారికి పెద్దగా రాజకీయ అవగాహనే ఉండదు. అలాంటి వారు వైసీపీ అధికారం కోల్పోగానే… పార్టీని వీడి టీడీపీలో చేరిపోతున్నారంటే… ఏమనుకోవాలి? అవినాశ్ రెడ్డే వారిని టీడీపీలోకి పంపించి అధికార పార్టీకి లొంగిపోయారా? ఇదే అనుమానం జగన్ కూ వచ్చందో, ఏమో తెలియదు గానీ… కడప కార్పొరేటర్లు టడీపీలో చేరిపోయారన్న వార్త తెలియంగానే… జగన్ ఒంటికాలిపై లేచారట. తొలి విడతలో కొందరు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరగా… వారి బాటలో నడిచేందుకు మరంత మంది రెడీ అయిపోయారట. మొత్తంగా కడప మేయర్ సీటును వైసీపీ నుంచి టీడీపీ లాగేసుకునే దిశగా వడివడిగా అడుగులు పడిపోతున్నాయట. ఈ విషయం తెలిసిన తర్వాతే జగన్… అవినాశ్ రెడ్డికి ఫోన్ చేసి మరీ వాయించారట.
చాలా ఏళ్ల తర్వాత కడప ఎమ్మెల్యే సీటు టీడీపీ ఖాతాలో పడింది. టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి సతీమణి మాధవి మొన్నటి ఎన్నికల్లో కడప ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అంతేకాకుండా ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఆమె వైసీపీ శ్రేణులు చుక్కలు చూపిస్తున్నారు. కడప మేయర్ స్థానంలో ఉంటూ ఇష్టారాజ్యం నిర్ణయాలు తీసుకుంటున్న వైసీపీ నేత సురేశ్ బాబుకు చెమటలు పట్టిస్తున్నారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో… నతకు ప్రొటోకాల్ మేరకు మేయర్ పక్కన సీటు వేయలేదంటూ మాధవి చేసిన రచ్చ వైసీపీని విస్మయానికి చేసిందనే చెప్పాలి. ఇక పులివెందుల ఎమ్మెల్యే ఎక్కడా?.. కడప ఎంపీ ఎక్కడా? అంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మాధవి ఎమ్మెల్యేగా ఉన్నంతవరకు ఇక తమ పప్పులు ఉడకవన్న భావన అయితే వైసీపీ నేతలకు వచ్చేసింది.కేవలం నెలల వ్యవధిలోనే కడపలో వైసీపీని మాధవి సెల్ఫ్ డిఫెన్స్ లో పడేశారు. ఈ పరిస్థితులన్నింటినీ గమనిస్తున్న జగన్… తన కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరగానే… బరస్ట్ అయిపోయారట.
ఇదిలా ఉంటే… ఎన్నడూ తనను పల్లెత్తు మాట కూడా అనని తన సోదరుడు ఇప్పుడు ఏకంగా ఏం పీకుతున్నావ్ అంటూ చెడామడా తిట్టిన వైనంపై అవినాశ్ రెడ్డి లోలోపలే మదనపడిపోతున్నారట. అయినా పార్టీ తరఫున తన వంతు కృషి తాను చేస్తూనే ఉన్నానని, అయినా కూడా ఇలాంటి అవమానాలు పడాల్సి వస్తోందని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయారట. 151 సీట్లున్న పార్టీ ఇప్పుడు 11 సీట్లకు పడిపోతే.. 23 సీట్లున్న టీడీపీ తన మిత్రపక్షాలతో కలిసి 164 సీట్లను గెలిస్తే… ఇక వైసీపీలోని నేతలను కాపాడుకునేదెలా? అని కూడా ఆయన ఆగ్రహాన్ని లోలోపలే దిగమింగుకున్నారట.
ఇవన్నీ తాను జగన్ ముందు ప్రస్తావించలేను కదా అనికూడా ఆయన తెగ బాధపడిపోతున్నారట. పార్టీని కాపాడుకోవాలని తనకూ ఉంటుందని… పార్టీని వీడి పోతున్న వారంతా తనకు చెప్పి పోతారా? అని వాపోతున్నారట. ఏదేమైనా జగన్ పీకిన వాయింపునకు అవినాశ్ రెడ్డి బాగా నొచ్చుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే… ఇకపై మరింత మంది పార్టీ నేతలు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటానని జగన్ కు ముక్తసరిగా చెప్పిన అవినాశ్ మిన్నకుండిపోయినట్లుగా సమాచారం.











