చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో వైసీపీ నేతలు అక్రమాలకు దిగారు. అక్కడ వేరే ప్రాంతం నుంచి వచ్చిన కొందరు యువకులు.. దొంగ ఓట్లు వేస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే కొత్తగా వచ్చిన యువకులు అనుమానస్పదంగా ఉండడంతో గ్రామస్తులు చెప్పే వరకు పోలీసులు పట్టించుకోలేదు. ఎస్ఈసీ నిబంధనల ప్రకారం.. ఓటరు ఆధార్ కార్డు, ఓటరు స్లిప్ చూపించి లోపలకు వెళ్లాలి. అవేవీ లేకుండా వీరు పోలింగ్ బూత్ లోకి వెళ్లి యథేచ్ఛగా ఓట్లు వేసి వచ్చేశారు. దీన్ని బట్టే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరికొంత మంది గోడలు దూకి దొంగ ఓట్లు వేయడానికి వస్తున్నారు.
నారావారిపల్లెలోని ప్రతి పోలింగ్ బూత్‌లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇంత జరుగుతున్నా.. పోలీసులు ఏమాత్రం స్పందించడంలేదు. తమ కేమీ సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు అంటున్నారు. చంద్రబాబు స్వగ్రామాన్ని ఎలాగైనా గెలుచుకోవాలని భావిస్తున్న వైసీపీ నాయకులు.. పోలీసుల సహకారంతో చెలరేగిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!
తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...











