వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఆయన భార్య డ్రామాలు ఆడుతున్నారా.?? ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయడానికి నందిగం ఫ్యామిలీ స్కెచ్‌లు వేస్తోందా..?? నందిగం పార్టీకి గుదిబండగా మారుతున్నారని, ఆయన వైసీపీని డ్యామేజ్ చేస్తున్నారని సొంత పార్టీలోని దళితనేతలే గుర్రుగా ఉన్నారా..?? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. నందిగం సురేష్‌పై వైసీపీలోని కొందరు దళితనేతలు ఆగ్రహంపై ఉన్నారని ప్రచారం జరుగుతోంది..
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో సారి జైలుకి వెళ్లాడు బాపట్ల మాజీ ఎంపీ నందిగం.. ఇటీవల తన స్వగ్రామంలో ఇసుకుప్పల రాజు అనే వ్యక్తితో అకారణంగా వైరం పెట్టుకున్నాడు సురేష్.. స్పీడుగా వెళుతున్న కారుని స్లోగా వెళ్లాలని సూచించినందుకు… రాజుని ఇంటికి తీసుకువచ్చి మరీ చితకబాదారు సురేష్ సోదరుడు, ఆయన అనుచరులు.. రాజుపై దాడి చేయడం, ఆయన ఫ్యామిలీతో కేసు పెట్టించుకొని జైలుకి వెళ్లడం వరకు మొత్తం డ్రామా అని కొందరు వైసీపీ దళిత నేతలు అనుమానిస్తున్నారు.. ఇదంతా కేవలం వైసీపీలో తన గ్రాఫ్‌ని, జగన్ దగ్గర తన ఇమేజ్‌ని పెంచుకోవడానికి వేస్తున్న ఎత్తుగా భావిస్తున్నారు ఈ దళిత నేతలు.. తన కారుకి అడ్డు వచ్చారని అకారణంగా అమాయకులపై దాడి చేయడం వెనక సురేష్ భారీ స్కెచ్ వేశాడని సందేహిస్తున్నారు.. ఆ తర్వాత సురేష్ భార్య పోలీసులతో మాట్లాడినట్లు ఓ రికార్డెడ్ ఆడియోని విడుదల చేసి, కాబోయే హోమ్ మినిస్టర్ తానే అని లీక్ ఇవ్వడం వెనక అసలు కారణం ఏంటని నిలదీస్తున్నారు.. ఇది పక్కా డ్రామానే అని హై కమాండ్‌కి సందేశాలు పంపుతున్నారు.
రెండు నెలల క్రితం సురేష్ జైలులో ఉన్న సమయంలో ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పరామర్శించి వచ్చారు.. ఈ ఎపిసోడ్‌లో జగన్ మరోసారి పరామర్శకి వెళితే, అది తమను నష్టమే అని సురేష్‌పై గుర్రుగా ఉన్న దళిత నేతలు హైకమాండ్ దగ్గర వాపోతున్నారట.. సురేష్ రౌడీయిజానికి ఇప్పటికి అయినా బ్రేకులు వేయాలని, లేదంటే పార్టీ పరువు పోవడం గ్యారంటీ అని చెబుతున్నారని తెలుస్తోంది.. ఈ ఘటనలో సురేష్‌పై ఆగ్రహం పెల్లుబుకుతోందని, ఆయనపై సొంత పార్టీలోనే సానుభూతి రావడం లేదని వివరించారట.. టీడీపీ పోరాడాల్సిన సమయంలో సురేష్.. జైలుకి వెళ్లేలా ప్లాన్ చేసున్నాడంటే, దీనిని సహించరాదని ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం..
సురేష్‌ని వెనకేసుకు వస్తే పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని కొందరు ఈ దళిత నేతలు రిపోర్టులు పంపారట.. ఈ సమాచారం జైలులో ఉన్న సురేష్‌కి లీక్ అయిందని తెలుస్తోంది.. దీంతో, పార్టీలో తనకు వ్యతిరేకంగా జరుగుతోన్న పోరుతో జైలులో ఉన్న సురేష్‌కి మైండ్ బ్లాంక్ అవుతోందని సమాచారం.. తాము ఒక స్కెచ్ వేస్తే అది బూమరాంగ్ అయిందని ఆయన అనుచరులు భావిస్తున్నారట.. మొత్తమ్మీద, ఎవరు చేసుకున్న ఖర్మ వారు అనుభవించకతప్పదు అంటే ఇదేనేమో అని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు..











