ఎన్నికల కమిషన్ ధోరణి సరిగా లేదంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు విజయసాయిరెడ్డి. నిమ్మగడ్డ.. చంద్రబాబుతో లాలూచీ పడి ఇలా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. శరీరం మాత్రమే నిమ్మగడ్డది.. ఆత్మ చంద్రబాబుది.. టీడీపీ అధ్యక్షుడి కనుసన్నలో నిమ్మగడ్డ నడుచుకుంటున్నారు. చంద్రబాబు.. చంద్రముఖిలా మారి నిమ్మగడ్డలో ప్రవేశించారు. సొంత నియోజకవర్గల్లోని దేవలయాల్లో దొంగతనాలు చేసిన చరిత్ర చంద్రబాబుది. వెన్నుపోటుదారుల జాతీయ సంఘానికి అధ్యక్షులు చంద్రబాబు.. అంటూ పదజాలంతో నిందించారు విజయసాయి.
నిమ్మగడ్డ మతిస్థిమితం లేని వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి రాజ్యాంగబద్ధమైన పదవికి అనర్హుడు. పంచాయతీ ఎన్నికలు పార్టీ పరంగా జరగవని చంద్రబాబుకు తెలియదా. చంద్రబాబు మేనిఫెస్టో ఎలా విడుదల చేస్తాడు? చంద్రబాబుపై నిమ్మగడ్డ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ప్రవచనాలు చెప్పడంలో నిమ్మగడ్డ.. చాగంటిని మించిపోయారు. మొదటి నుండి నిమ్మగడ్డ మొండి వైఖరి చూపుతున్నారు. నిమ్మగడ్డ నిమిషానికొకసారి బెదిరిస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు. రాజ్యంగ పరమైన పదివిలో ఉండి ఇలా ప్రవర్తించడం విచారకరం. నిమ్మగడ్డ రాష్ట్రా ఎన్నికల కమిషనర్ లేదా టీడీపీ ఎన్నికల కమిషనరా అర్థం కావట్లేదు.
Must Read ;- కత్తి దూసిన నిమ్మగడ్డ.. వేటు షురూ!











