స్థానిక ఎన్నికలపై సుప్రీంతీర్పులో ఏపీ ఉన్నతాధికారులు దారిలోకి వచ్చారు. సుప్రీం తీర్పుకు ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమావేశాలు ఏర్పాటు చేసినా, మాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించిన సీనియర్ ఐఏఎస్, ఐసీఎస్ అధికారులు ఇప్పుడు చక్కగా చేతులు కట్టుకుని సమావేశాల్లో నిమ్మగడ్డ చెప్పేది శ్రద్ధగా వింటున్నారు. ఏ మాత్రం తోక జాడించినా ఎన్నికల కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే విషయం పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు ద్వివేది, గిరిజా శంకర్ ల విషయంలో అర్థమై పోయింది. అందుకే నిమ్మగడ్డ కంటే ముందు మీటింగ్ లకు వచ్చి లైనుగా ఒకరి తరవాత ఒకరు కూర్చుంటున్నారు.
ఆహా ఏమి క్రమశిక్షణ
ఏపీలో అధికారులు వైసీపీ నేతలు చెప్పినట్టు ఆడారు. స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పును కూడా లెక్కచేయలేదు. చివరకు సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో అందరూ మెత్తపడ్డారు. అటు అధికార పార్టీ అధినేత సహా, ఉన్నతాధికారులు కూడా దారిలోకి వచ్చారు. ఇక నిమ్మగడ్డను చూస్తూ పాఠశాలలో హెడ్ మాస్టర్ ను చూసిన పిల్లాడిలా చేతుకు కట్టుకుని ఆయన చెప్పేంది శ్రద్ధగా వింటున్నారు. ఇక మీడియా ముందు కూడా ఆచితూచి మాట్లాడుతున్నారు. స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు మానసికంగా సిద్దమైనట్టే కనిపిస్తున్నారు.
Must Read ;- ఆడు మగాడ్రా బుజ్జీ : నాడు శేషన్.. నేడు నిమ్మగడ్డ!