ఏపీ పంచాయతీ ఎన్నికల ప్రచారం మొదలైంది. టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘పల్లె ప్రగతి-పంచ సూత్రాల’ పేరుతో చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గ్రామాల్లో సుపరిపాలన ఉన్నప్పుడే, రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు.
టీడీపీ పంచసూత్రాలు..
- రక్షిత మంచినీటి పథకం. ఉచిత కొళాయిలు.
- ప్రజలు సురక్షితంగా ఉండాల్సిన అవసరం. అందుకే వారి భద్రతకు భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
- ఆలయాలపై దాడులను అడ్డుకోవడంతోపాటు.. ప్రజల ఆస్తులకు కూడా భద్రత కల్పిస్తామని మాటిస్తున్నాం.
- సుపరిపాలనలో భాగంగా, రైతుల స్వయం సమృద్ధిలో భాగంగా మోటర్లకు మీటర్లు బిగించే ప్రాజెక్టు స్వస్తి పలికేలా పోరాటం చేస్తాం.
- ఆస్తి పన్ను తగ్గించి.. సేవలను మెరుగుపరుస్తాం. గ్రామాల్లో పరిశుభ్రత దిశగా చర్యలు చేపట్టి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేలా కృషి చేస్తాం.
జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలి..
ఏకగ్రీవాల పేరుతో.. జగన్ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని, బెదిరింపులకు దిగుతుందని ఆరోపించారు. ఇందుకోసం అధికార ప్రతినిధులకు ప్రభుత్వం తరపున పనిచేయించుకోవడం విచారకరమని చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వం తీరు సర్వత్రా అభ్యంతరకరమని పేర్కొన్నారు. టీడీపీ హయంలో జరిగిన అభివృద్ధిని జనం గమనించాలని.. అలాగే వైసీపీ 20 నెలల పరిపాలనలో జరిగని అభివృద్ధి ఏమీ లేదని.. పైగా ఎన్నో కంపెనీలు వెనక్కు వెళ్లిపోయానని.. దాని వల్ల అభివృద్ధి కుంటుపడిందని ప్రభుత్వం విధానాలను ఎండకట్టారు.
Must Read ;- దక్షిణాదిలో జగన్ సర్కార్ నెం.1! ఎలాగంటే..