ఏపీలో స్థానిక ఎన్నికలపై అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నోరు విప్పారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక తరవాత, ఏప్రిల్, మే మాసాల్లో స్థానిక ఎన్నికలుంటాయని ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో చెప్పారు. ఓవైపు ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నిస్తున్న తరుణంలో ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మార్చి నెల చివరకు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ చేయనున్నారు. ఆ తరవాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ అధినేత భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయి.
నిమ్మగడ్డ పదవీ విరమణ తర్వాతే..
ఏపీలో కరోనా విస్తృతంగా ఉందని ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మార్చి నెలలో నిమ్మగడ్డ పదవీ విరమణ చేయగానే స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అంటే నిమ్మగడ్డ పదవీ విరమణ చేయగానే, ఏప్రిల్‌లో స్థానిక ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయిరెడ్డి వ్యాఖ్యలే ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.
Must Read ;- కొత్త ‘స్ట్రెయిన్’ గండంతో నిమ్మగడ్డ ఏంచేస్తారో?