పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ పిరియాడిక్ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ మూవీ చేస్తున్నారు. ఇటీవల గ్రాండ్ గా స్టార్ట్ అయిన సలార్ ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది.
అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా కూడా ఇటీవల స్టార్ట్ అయ్యింది. సలార్ సినిమాని ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంటే.. ఆదిపురుష్ మూవీని 2022లో ఆగష్టు 11న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇక మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. ఈ క్రేజీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రభాస్ మరో బాలీవుడ్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరితో అంటే.. హృతిక్ రోషన్ తో బ్యాంగ్ బ్యాంగ్, వార్ చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తో అని సమాచారం. ఈ ప్రాజక్టుకు సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని, వీరి కలయికలో ఓ భారీ యాక్షన్ సినిమా రానుందని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. మరి.. త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Must Read ;- ‘ఆదిపురుష్’ లో ప్రభాస్ తమ్ముడుగా బాలీవుడ్ హీరో











