ఏపీ రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. నిమ్మగడ్డ, ప్రభుత్వ మంత్రులు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం కొత్త రూపు సంతరించుకుంటుంది. మునుపెన్నడూ లేని విధంగా.. మంత్రులు ఒక ఎన్నికల కమిషనర్‌పై తీవ్రమైన ఆరోపణలతో దాడి చేస్తున్నారు. వాటిని అంతే ధాటిగా ఎదుర్కొంటూ ముందడుగేస్తున్నారు నిమ్మగడ్డ. ఎక్కడా తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు నిమ్మగడ్డ. రాజ్యంగ బద్దమైన పదవిలో ఉన్న వ్యక్తి తన పని కచ్చితంగా చేయాలని మొండిపట్టు పడితే.. ప్రభుత్వమైనా తలవంచాల్సిందేనని నిమ్మగడ్డ నేటి తరానికి ప్రత్యక్షంగా చూపించారు. ఇక వేరే దారిలేక ఎన్నికలకు ముక్తసరిగా సరే అన్నా ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు నిమ్మగడ్డ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి అడ్డుపుల్ల వేస్తూనే ఉంది. అలా అడ్డుపుల్ల వేయలేని వాటికి నోరు చేసుకుంటున్నారు మంత్రులు. దాని ప్రభావమే.. ప్రస్తుత లేఖ..
తనపై జులం చూపిస్తే.. ఏ మాత్రం తగ్గే వ్యక్తిని కాదని ఇప్పటికే నిరూపించి మరీ చూపించారు నిమ్మగడ్డ. తాజాగా మంత్రులు కాస్త ఎక్కువగానే నోరు చేసుకుంటున్న నేపథ్యంలో.. వారిపై చర్యలకు ఉపక్రమించారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ. సజ్జలను ప్రభుత్వ సలహాదారు పదవి నుండి తప్పించాలని లేఖ రాశారు. రాజ్యాంగ పరమైన పదవిలో ఉన్న తనకు రాజకీయాన్ని ఆపాదించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రులపై చర్యలు చేపట్టాలని తన లేఖలో పేర్కోన్నారు. ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయమై, భారత అటార్ని జనరల్ నుంచి న్యాయ సలహా తీసుకోవాలని లేఖలో వెల్లడించారు. గవర్నర్ చర్యలు తీసుకోవడం విఫలమైతే కోర్టుకు వెళ్లాడానికి నిర్ణయించుకున్న నిమ్మగడ్డ.
Must Read ;- నిమ్మగడ్డది శునకానందం : గౌరవనీయ మంత్రి వ్యాఖ్య