జేసి ప్రభాకర రెడ్డికి కరోనా సోకింది. మంగళవానం నిర్వహించిన పరీక్షల్లో జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. జైలు సిబ్బంది జేసీ ప్రభాకర్ రెడ్డిని ప్రత్యేక గదిలో పెట్టి పర్యవేక్షణ చేస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన 317 మందికి ముగ్గురు వైద్యులతో పర్యవేక్షణ జరుగుతోంది. ఒక్కొక్క డాక్టరు వందమందికి పైగా కరోనా రోగులను ట్రీట్ చేస్తున్నారంటేనే… పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతుంది. ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కూడా కరోనా బారిన పడ్డారు. ఆయనను ఇటీవలే ఎన్నారై ఆస్పత్రికి తరలించారు. అరెస్టు చేసిన సమయంనుంచి అచ్చెనాయుడు పట్ల పోలీసులు, అధికారులు చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణల మధ్య.. ఆయనకు కరోనా సోకిన తర్వాత కూడా కనీస జాగ్రత్తలతో పద్ధతైన చికిత్స అందించలేదనే ఆరోపణలున్నాయి.
తెలుగుదేశం నాయకులు తమ మీద అధికారపార్టీ వేధింపులకు దిగుతోందని తొలినుంచి ఆరోపిస్తున్నారు. కేసులు బనాయించి అరెస్టు చేసి జైళ్లకు పంపుతూ కక్ష సాధిస్తున్నారనే ఆరోపణలు వారినుంచి వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, కొల్లు రవీంద్ర జైళ్లలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడుకు కరోనా సోకడం రెండు రోజుల కిందట ప్రకంపనాలు సృష్టించింది. ఆయనకు సరైన చికిత్స కూడా అందలేదని ఆరోపణలు వచ్చాయి. చివరికి ఒత్తిడి అధికారుల మీద ఒత్తిడి పెరిగింది. గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందుతుండగా.. అక్కడినుంచి.. ఎన్నారై ఆస్పత్రికి తరలించి.. ప్రత్యేకంగా గదిని కేటాయించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో తప్ప పోలీసుల్లో కదలిక రాలేదు. ఆ తర్వాత ఆయనను తరలించారు.
ఈ నేపథ్యంలో ఒకసారి బెయిలు మీద విడుదల అయి, వెంటనే మళ్లీ అరెస్టు అయిన జేసీ ప్రభాకరరెడ్డికి కూడా కడప జైలులో కరోనా సోకడం గమనార్హం. తమ నాయకులను అక్రమ కేసులతో అరెస్టుచేయడం మాత్రమే కాకుండా.. వారి ఆరోగ్యం పట్ల కనీస శ్రద్ధ కూడా లేకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వం తీరు పట్ల తెలుగుదేశం శ్రేణులు భగ్గుమంటున్నాయి.
జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!
నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...











