AP సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సత్తా చాటారు. జాతీయ స్థాయిలో తిరుగులేని నేతగా నిరూపించుకున్నారు. దేశంలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకులతో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ – IE100 2026 ప్రకటించిన తాజా జాబితాలో చంద్రబాబు ఏకంగా 13వ స్థానం కైవసం చేసుకున్నారు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన నంబర్ వన్ తెలుగు నేతగా చంద్రబాబు చరిత్ర సృష్టించారు. జాతీయ స్థాయిలో ఆయనకున్న ఇమేజ్‌కు, రాజకీయ చతురతకు ఈ ర్యాంకింగ్స్ నిదర్శనం..
దశాబ్దాల రాజకీయ అనుభవం, సంక్షోభాలను దీటుగా ఎదుర్కొనే నైపుణ్యం చంద్రబాబును ఈ స్థానంలో నిలబెట్టాయి. ఒకవైపు ఏపీ సీఎంగా రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి గాడిలో పెడుతూనే, మరోవైపు కేంద్రంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. జాతీయ స్థాయిలో నిర్ణయాలను ప్రభావితం చేయగల ఆయన సామర్థ్యమే, దేశంలోని హేమాహేమీ నాయకుల మధ్య ఆయనకు 13వ ర్యాంకు దక్కేలా చేసింది..
చంద్రబాబు తర్వాత, తెలుగు రాష్ట్రాల నుంచి ఈ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలిచారు. 25వ ర్యాంకు సాధించిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ తర్వాత అత్యంత శక్తిమంతమైన రెండో నాయకుడిగా ఎదిగారు. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ లాంటి సీనియర్లను సైతం వెనక్కి నెట్టి రేవంత్ ఈ ఘనత సాధించడం, జాతీయ కాంగ్రెస్‌లో ఆయన పెరుగుతున్న గ్రాఫ్‌ను సూచిస్తోంది..
AP ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 68వ స్థానంలో నిలిచారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు 90వ స్థానంలో నిలిచారు. టాప్ 100లో బీఆర్ఎస్ (BRS), వైసీపీ పార్టీలకు చెందిన ఒక్క నాయకుడికి కూడా చోటు దక్కకపోవడం గమనార్హం. జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక జాబితాలో ఈ రెండు పార్టీల ఉనికి పూర్తిగా కనుమరుగవ్వడం.. ఆ పార్టీల దీనస్థితికి అద్దం పడుతోంది..











