కర్నూలు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి 14 మంది బలి అయ్యారు.
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని మదార్ పురం వద్ద ప్రమాదం జరిగింది. టెంపో లారీని ఢీకొనడంతో టెంపోలోని వారు దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిలో 8 మంది మహిళలు 5 గురు పురుషులు 1 సం చిన్నారి ఉన్నారు. టెంపో చిత్తూరు జిల్లా మదనపల్లి నుండి అజ్మీర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
మార్గమధ్యం మాదర్ పురం వెళుతుండగా, తొలుత బ్రిడ్జిని ఢీకొన్న అనంతపురం, అటువైపు వెళ్తున్న లారీని ఈ టెంపో ఢీకొంది. టెంపో లో వారు మృతి చెందారు. మరో ఇద్దరు పిల్లల కు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Must Read ;- అరకు ఘాట్‌రోడ్డు ప్రమాదంపై విచారణకు కమిటీ











