సంగం డెయిరీలో అవినీతికి పాల్పడ్డారంటూ టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకున్న సంగతి తెలసిందే. ఆ తరవాత విజయవాడ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మంగళగిరిలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరిచారు. దూళిపాళ్ల నరేంద్రకు ఏసీబీ కోర్టు
సంగం డెయిరీలోనూ తనిఖీలు
గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీ ప్లాంటులో ఏసీబీ అధికారులు రికార్డులు తనిఖీ చేశారు. వందలాది మంది పోలీసులను మోహరించి సంగం డెయిరీలో అనేక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. డెయిరీ ఛైర్మన్ గా ఉన్న దూళిపాళ్ల నరేంద్ర ఛాంబర్ ను కూడా సీజ్ చేశారు. డెయిరీకి చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
అరాచకాలకు అంతే లేకుండా పోతోంది
రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు అడ్డే లేకుండా పోతోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ఫ్యాక్షనిస్టులకు అధికారం ఇస్తే ఇలాగే ఉంటుందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.