నటసింహ నందమూరి బాలకృష్ణ, మలినేని గోపీచంద్ కాంబినేషన్లో ఓ భారీ యాక్షన్ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అయితే.. ఈ చిత్రంలో బాలకృష్ణ పాత్ర పేరు వీర సింహారెడ్డి అని తెలిసింది. దీంతో ఈ సినిమాకి వీర సింహారెడ్డి అనే పేరే టైటిల్ గా ఖరారు పెడతారని వార్తలు వస్తున్నాయి. దీనికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది.
అది ఏంటంటే… రెడ్డి టైటిల్ తో బాలయ్యకు హిట్ సెంటిమెంట్ ఉంది. బాలకృష్ణ కెరీర్ లో మైలురాయి లాంటి సినిమా సమరసింహారెడ్డి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇంకా చెప్పాలంటే.. ఈ సినిమాతో ఫ్యాక్షన్ కథలకు కొత్త ఊపు తీసుకువచ్చింది. అలాగే సింహా కూడా బాలయ్యకు బాగా కలిసొచ్చిన టైటిల్. ఈ సెంటిమెంట్ ప్రకారం వీరసింహారెడ్డి టైటిల్ ఫిక్స్ చేసే అవకాశం ఉంది చెప్పచ్చు.
ఇదిలా ఉంటే.. ఇది రీమేక్ అని ప్రచారం జరుగుతుంది కానీ.. రీమేక్ కాదని సమాచారం. గోపీచంద్ మలినేని ఒరిజినల్ స్టోరీతోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఇందులో బాలయ్య సరసన శృతిహాసన్ నటిస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుంటే.. దునియా విజయ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. అఖండ సక్సస్ తర్వాత బాలయ్య, క్రాక్ సక్సస్ తర్వాత మలినేని గోపీచంద్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి.. బాలయ్య, మలినేని గోపీచంద్ ఏ రేంజ్ సక్సస్ సాధిస్తారో చూడాలి.











