టాలీవుడ్ లో హీరోల కొడుకులు హీరోలుగా రంగప్రవేశం చేయడం.. నాటి నుంచి నేటి వరకు జరుగుతూనే ఉంది. ఇప్పుడు హీరోల సిస్టర్స్ ఎంట్రీ ఇస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సిస్టర్ మంజుల నటిగా, నిర్మాతగా, దర్శకురాలుగా పరిచయం అయ్యారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిస్టర్ సుస్మిత కాస్ట్యూమ్స్ డిజైనర్ గా చిరంజీవి సినిమాలకు వర్క్ చేశారు. ఇప్పుడు నిర్మాణ సంస్థను ప్రారంభించి వెబ్ సిరీస్, సినిమాలు నిర్మిస్తున్నారు. తొలి ప్రయత్నంగా ఏక్ మినీ కథ హీరో సంతోష్ శోభన్ తో ఓ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక నితిన్ సిస్టర్.. నిఖితా రెడ్డి శ్రేష్ట మూవీస్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నారు. తాజా ఇప్పుడు ఇద్దరు హీరోల సిస్టర్స్ సినిమాల మేకింగ్ లోకి అడుగుపెడుతున్నారు. ప్రభాస్ సిస్టర్ ప్రసీద, నాని సిస్టర్ దీప్తి. హీరోలుగా, నిర్మాతలుగా అన్నయ్యలు సెట్ లో బిజీగా ఉంటే.. సెట్ లో పనులు చక్కపెబుతున్నారు ఈ చెల్లెల్లు. నాని నిర్మిస్తున్న చిత్రం మీట్ క్యూట్. ఈ సినిమా ద్వారా నాని సిస్టర్ దీప్తి దర్శకురాలుగా పరిచయం అవుతున్నారు. నాని వాల్ పోస్టర్ బ్యానర్ స్టార్ట్ చేసి కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తున్నాడు నాని. షార్ట్ ఫిల్మ్ తీసిన అనుభవంతో ఇప్పుడు దీప్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
నాని హీరోగా బిజీగా ఉంటే.. సిస్టర్ దీప్తి ఇప్పుడు దర్శకురాలిగా సినిమా తీస్తుంది. ఆయన నిర్మాణ బాధ్యతలను కూడా ఈమె చూసుకుంటుంది. ప్రభాస్ సిస్టర్ ప్రసీద నిర్మాతగా మారింది. ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి ప్రసీద నిర్మాత. రాధేశ్యామ్ నిర్మాతల్లో ప్రసీద ఒకరు. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కుమార్తె ప్రసీద. అమెరికాలో ఫిల్మ్ మేకింగ్ లో కోర్స్ చేసింది.
అలాగే అక్కడ సినిమాల్లో కొంత కాలం వర్క్ చేసింది. స్వదేశానికి వచ్చిన తర్వాత సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణ బాధ్యతలు తీసుకున్నారు. ప్రసీదకు నిర్మాణం, పబ్లిసిటీ మీద మంచి పట్టు ఉంది. జాతిరత్నాలు పబ్లిసిటీలో ప్రసదీ కీలక పాత్ర పోషించారు. మరి.. ఈ హీరోల సిస్టర్స్ బ్రదర్స్ వలే.. కెరీర్ లో రాణిస్తారని ఆశిద్దాం.