ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరివెళ్లనున్నారు చంద్రబాబు. ఇక ప్రస్తుతం కుంభమేళాలో పాల్గొనేందుకు యూపీ ప్రయాగ్‌రాజ్ వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సైతం నేరుగా అక్కడి నుంచి హస్తినకు వెళ్లనున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం రెండు రోజుల పాటు హస్తినలోనే ఉంటారని సమాచారం. ఢిల్లీ పర్యటన కోసం రేపు జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని సైతం వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ కొత్త మఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ హాజరుకానున్నారు. గురువారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు రామ్‌లీలా మైదాన్‌లో కొత్త సీఎం ప్రమాణస్వీకారం జరగనుంది. మంత్రులు సైతం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీ.కె.సక్సెనా వీరితో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
దాదాపు 3 దశాబ్ధాల తర్వాత ఢిల్లీలో కాషాయ జెండా ఎగిరిన విషయం తెలిసిందే. బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించగా..ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకు పరిమితమైంది. దీంతో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహిస్తోంది బీజేపీ. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి NDA భాగస్వామ్య పక్షాలకు ఆహ్వానం పంపించింది. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్‌లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు మోదీ.
ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులతో పాటు యూపీ, హర్యానా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, బిహార్ ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. వీరితో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, వివేక్ ఒబెరాయ్, ఎంపీ హేమామాలిని, కిరణ్ ఖేర్ హాజరుకానున్నారు. ఇప్పటికే ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. ఇవాళ జరగనున్న బీజేఎల్పీ సమావేశంలో ఢిల్లీ సీఎంను ఎన్నుకోనున్నారు. సీఎం రేసులో పర్వేష్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
హస్తినలో రెండు రోజులపాటు చంద్రబాబు మకాం వేస్తున్నారన్న వార్త తెలియగానే, జగన్ హార్ట్ బీట్ పెరిగిందనే చర్చ మొదలయింది.. ఇటు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అక్కడే రెండు రోజులు ఉండబోతున్నారనే సమాచారంతో వైసీపీలో దడ మొదలయింది.. జగన్ కేసులు, ఆయన అవినీతి, అరాచకాలతోపాటు ఇతర అంశాలపై ఇప్పటికే అన్ని రిపోర్టుల ప్రభుత్వం దగ్గర రెడీగా ఉన్నాయి.. సో, ఈ రెండు రోజుల్లో ఈ అంశాలపై ఒక నిర్ణయం రావొచ్చని ఢిల్లీ వర్గాల నుండి అందుతోన్న లీకులు.. మరి, జగన్ వీటిని ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి..










