తమిళ హీరో శింబు, హీరోయిన్ త్రిష పెళ్లి వార్త ప్రస్తుతం సినిమా రంగంలో గుప్పుమంటోంది. వీరిద్దరి ప్రేమ వ్యవహారంపై ఎప్పట్నుంచో వదంతులు ఉన్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారని సినిమా వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కరోనా లాక్ డౌన్ కు ముందు కూడా ఇలాంటి రూమర్లే వచ్చాయి. తాజాగా వస్తున్న వార్తలు నిజమయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరి పెళ్లికి శింబు తండ్రి, దర్శకనిర్మాత టి. రాజేందర్ అంగీకరించడం లేదని తెలుస్తోంది.
తమపై వెలువడుతున్న వార్తలపై వీరిద్దరిలో ఎవరూ స్పందించడం లేదు. అయితే వీరి ప్రవర్తన మాత్రం మొదట్నుంచీ వివాదాస్పదంగానే ఉంది. తండ్రి మందలించడంతో శింబు కొంత తన వైఖరిని మార్చుకుని కెరీర్ పై దృష్టి పెట్టాడు. ఈ మధ్య వీరిద్దరూ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ షార్ట్ ఫిలింలో కూడా నటించారు. ప్రస్తుతం శింబు సుశీంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
దాదాపు నెల రోజుల పాటు అతను ఈ సినిమా షూటింగులో పాల్గొంటాడు. దీని కోసం బరువు బాగా తగ్గాడు కూడా. 20 కిలోల బరువు తగ్గడంతో సన్నగా నాజూకుగా తయారయ్యాడు. ఆ మధ్య శింబు తండ్రి టి. రాజేందర్ నిర్మాతల మండలి ఎన్నికల కోసం ఓ ప్రెస్ మీట్ పెట్టారు. అందులో శింబు వివాహంపై స్పందించమని విలేకర్లు కోరినపుడు కూడా రాజేందర్ చిరాకు పడ్డారు. దాంతో ఆయనకు శింబి, త్రిషల పెళ్లి ఇష్టం లేదనేది అర్థమైంది. రాజేందర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చి ఉంటే వీరిద్దరి పెళ్లి ఎప్పుడో జరిగి ఉండేది.











