రాష్ట్రంలో దసరా సెలవు ఈ సారి గందరగోళంగా మారిపోయింది. ముందు అంతా ఆదివారం (25వ తేదీ)నే దసరా సెలవుగా నిర్ణయించారు.. అయితే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈనెల 26న దసరా సెలవును ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం సోమవారం 26వ తేదీన ఐచ్చిక సెలవుగా ప్రకటించింది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఓ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఈ నెల 26న ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. పండుగ ఆదివారం కావడంతో సెలవును సోమవారానికి మార్చాలని ఉద్యోగుల నుంచి విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది.
ఏపీ వ్యాప్తంగా మహిళా ఉద్యోగులకు 26న సెలవు వర్తిస్తుందని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. మగవాళ్లు ఏం పాపం చేశారని ప్రభుత్వ ఉద్యోగులైన పురుషపుంగవులు ఆశ్చర్యపోతున్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీని ఇక్కడ చూడండి :












