కట్టుకున్న భార్య మానప్రాణాలను కాపాడాల్సిన భర్తే కీచక అవతారం ఎత్తాడు. భార్య నగ్న వీడియోలు బయట పెట్టి వేధించాడు. తన స్నేహితులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఏ భర్త చేయకూడని పనిని డబ్బు వ్యామోహంలో చేశాడు. తన భార్య నగ్న వీడియోలను డబ్బులకు అమ్ముకున్నాడు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే పనిని ఆ కీచక భర్త చేశాడు.
వివరాళ్లోకి వెళితే.. ఏ భర్త చేయకూడని పనిని వంశీకాంత్ రెడ్డి తన భార్యపట్ల చేశాడు. కడవరకు తోడు ఉంటూ భార్య మానప్రాణాలు కాపాడాల్సిన భర్తే తన భార్యపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఏకంగా తన భార్య నగ్న వీడియోలను ఇంటర్నెట్‌లో పెట్టి వేధించాడు. అంతేకాకుండా తన స్నేహితులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని భార్యను వేధించాడు. వంశీకాంత రెడ్డి భార్య వీడియోలను శివకుమార్ అనే వ్యక్తి ఫోన్‌పేలో డబ్బులు చెల్లించి నగ్న వీడియోలు డౌన్లోడ్ చేసుకున్నాడు. దీంతోపాటు పలు యాప్స్ ద్వారా భార్య నగ్న వీడియోలను అమ్మె ప్రయత్నాన్ని వంశీకాంత రెడ్డి చేశాడు. సులభంగా డబ్బు సంపాధన కోసం ఈ మర్గం ఎంచుకున్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. బాధితురాలి అత్తమామతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేయాల్సి ఉందని చెప్పారు. ఈ కేసులో ఏ1గా ఉన్న భర్త వంశీకాంత్ రెడ్డితో పాటు ఏ5గా ఉన్న శివకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.