పురపాలక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను ‘పల్లెలు గెలిచాయి..ఇప్పుడిక మనవంతు’ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. మొత్తం 10 అంశాలతో కూడిన మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, పంచుమర్తి అనురాధ తదితరులు పాల్గొన్నారు.
మేనిఫెస్టోలోని పది అంశాలు..
మూతపడిన అన్నా క్యాంటీన్లు పున:ప్రారంభం.. పేదలకు రూ.5కే భోజనం.
ఆస్తి పన్నుల పాత బకాయిలు రద్దు.. ప్రస్తుత స్లాబులో సగమే విధింపు.
శుభ్రమైన పట్టణం.. శుద్ధమైన తాగునీరు సరఫరా.
నిరుద్యోగ యువత కోసం ప్రతి 6 నెలలకు జాబ్ మేళా.
పట్టణాల్లో సుందరీకరణ మిషన్.. గతుకులు లేని రోడ్లు.. ప్రతివార్డులో పార్కులు.. ఓపెన్ జిమ్, ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు.
ఆటో డ్రైవర్లకు టాయిలెట్లు, తాగునీటి సౌకర్యంతో ఉచితంగా శాశ్వత ఆటో స్టాండ్ల నిర్మాణం.
మెప్మా గ్రూపులకు సమావేశ మందిరాలు, మెప్మా బజార్లు, సున్నా వడ్డీ రుణాలు.
పట్టణ పేదలకు శాశ్వత గృహ నిర్మాణం.. టిడ్కో హౌసింగ్ ప్రాజెక్టుల పూర్తి.
పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.21 వేలకు పెంపు.
ప్రతి ఇంటికీ ఉచిత మంచినీటి కనెక్షన్.. నీటి పన్నుల రద్దు.
Must Read ;- పురపాలికల్లో ఏకగ్రీవాల పరిశీలన.. వైసీపీకి నిమ్మగడ్డ షాక్











