తిరుపతిలోని రుయా ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయిన ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని వెల్లడించారు. ఊపిరి అందించే వాయువుని సక్రమంగా అందించని దుస్థితి నెలకొనడం వల్లే ఈ విషాదకర ఘటన జరిగిందన్నారు. రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా, వైద్యపరమైన మౌలిక వసతులు సరిగా లేవని రోగులు ఎంతో ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ఏపీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని, కరోనా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి విపత్కర సమయంలో విమర్శలు చేయకూడదని సంయమనం పాటిస్తున్నామంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా కాలంలో స్వార్ధ రాజకీయాలు వీడి.. ప్రజారోగ్యంపై పనిచేయాలని కోరారు.
జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!
మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...










