రోమ్ తగలబడుతుంటే పిడేలు వాయించినట్టు,కరోనాతో జనం చస్తూ ఉంటే వైసీపీ ప్రజాప్రతినిధులు మాత్రం చక్కగా గుర్రపు స్వారీలతో హల్ చల్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైసీపీ ప్రజాప్రతినిధుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.జనం చస్తున్నా వారికేమీ పట్టడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.
సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తుంటే..
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తూ వేలాది మందిని పొట్టనబెట్టుకుంటుంటే, వైసీపీ ప్రజా ప్రతినిధులకు ఇవేమీ పట్టడం లేదు.కడప జిల్లా రాజంపేట వైసీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకెపాటి అమర్‌నాథ్‌రెడ్డి,రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కోడూరు శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు,కడప మేయర్ సురేష్ బాబు గుర్రపు స్వారీల్లో మునిగి తేలుతున్నారు.ప్రతి రోజూ అన్ని జిల్లాల్లో కరోనా రోగులు బెడ్లు, మందులు,ఆక్సిజన్ అందక చస్తూ ఉంటే పర్యవేక్షణ చేయడం మానివేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు ఆకెపాటి ఎస్టేట్లో గుర్రపు స్వారీ చేస్తూ సేద తీరుతున్న వీడియోలు వైరల్‌గా మారాయి.











