ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నా.. మరోవైపు జనాలు గుంపుగుంపులుగా రోడ్ల మీదకు వస్తున్నారు. నాలగు గంటల వరకు మాత్రమే లాక్ డౌన్ మినహాయింపు ఉండటంతో జనం విచ్చల విడిగా తిరుగుతున్నారు. ఇక మద్యం షాపులయితే కిక్కిరిసి కనిపిస్తున్నాయి. కనీస మాస్కులు ధరిచంకుండా, భౌతిక దూరం లేకుండా తిరుగుతున్నారు. నిత్యావసరాలు, ఇతర వస్తువుల కోసం పెద్దసంఖ్యలో జనం రోడ్లపైకి వస్తుండటంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. ఓల్డ్ సిటీలోని చాలా ప్రాంతాల్లో జనాలు కోవిడ్ రూల్స్ పాటించకుండానే బయటకు వస్తున్నారు. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో పోలీసులు లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తామని చెబుతున్నారు.
జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!
మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...










