ఒక్క రోజే 101 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా భారిన పడిన వారి సంఖ్య 14.37 లక్షలకు చేరింది. వీరిలో 12 లక్షల మంది కోలుకోగా ఇంకా 2.37 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో పాజిటివిటీ రేటు 23 శాతం పైనే ఉండవచ్చని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా టెస్టులు తగ్గించినా కేసులు మాత్రం పెరిగిపోతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు ఇంటింటి సర్వే ప్రారంభించారు. మరో రెండు వారాల్లో ఈ సర్వే పూర్తి కానుంది.
తూర్పుగోదావరి జిల్లాలో ప్రమాద ఘంటికలు
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఒక్క రోజే 3 వేలకుపైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశంలోనే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఏడు జిల్లాలో తూర్పుగోదావరి కూడా నిలిచింది. తూర్పుగోదావరిలో కొన్ని గ్రామాల్లో 40 శాతం మందిలో కరోనా లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. అయినా తూర్పుగోదావరిలో ప్రజలు సామాజికదూరం పాటించడం లేదు. దీంతో ఆదివారం మాంసం విక్రయాలను కూడా కలెక్టర్ నిలిపివేశారు.
Must Read ;- కోవిడ్ కేర్ సెంటర్‌గా తన ఫంక్షన్ హాల్.. ఎంపీ సుజానా చౌదరి సేవలు భేష్











