ఏపీలో సెకండ్ వేవ్ విరుచుకుపడుతోంది. కరోనా కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. దీనికి తోడు బ్లక్ ఫంగస్ కేసులు వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనంతరం జిల్లా ధర్మవరం కు చెందిన శ్రీవత్స అనే యువకుడు సోషల్ మీడియా పోస్టు వైరల్ గా మారుతోంది. ప్రభుత్వాస్పత్రిలో సరైన చికిత్స అందించకపోవడంతో, మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు మొర పెట్టుకున్నాడు. బాబు నువ్వే ఆదుకోవాలంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.

ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండటంతో టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత వీడియో కాల్ చేసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీపరంగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా శీవత్స మాట్లాడుతూ ఇప్పటికే కరోనా కారణంగా నానమ్మ, నాన్నను కోల్పోయామని, ఇప్పుడు మా తాత కూడా సరైన చికిత్స అందక చనిపోయాడు అని తన ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుటుంబాన్ని చంద్రబాబే ఆదుకోవాలని కన్నీటి పర్యంతమయ్యాడు.










