టాలీవుడ్ లో దర్శకురాలిగా నందిని రెడ్డి టాలెంట్ తెలిసిందే. ఇన్నోవేటివ్ స్టోరీస్ తో ప్రేక్షకుల్ని మెప్పించే సినిమాలు తీసిన ఆమె.. ఎర్లియర్ గా ‘ఓ బేబీ’ అనే మూవీతో అందరినీ ఎమోషనల్ గా బాగా కదిలించింది. ఈ సినిమా సమంత స్థాయిని మరింత పెంచింది. అలాగే.. దర్శకురాలిగా నందిని రెడ్డి రేంజ్ కూడా అందరికీ అర్ధమైంది. ఈ సినిమా తర్వాత నందిని మరో సినిమా తీయలేదు కానీ.. ఓ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె వైజయంతి బ్యానర్ లో ఒక సినిమాకి కమిట్ అయింది.
అయితే యంగ్ హీరోలెవరూ ఖాళీగా లేకపోవడంతో .. ఇప్పటి వరకూ నందిని వెయిటింగ్ లో ఉంది. ఎట్టకేలకు ఇప్పుడు నందిని రెడ్డి హీరో దొరికేసినట్టు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు.. ఇటీవల ఓటీటీలో ‘ఏక్ మినీ కథ’ సినిమాతో మంచి హిట్టు కొట్టిన సంతోష్ శోభన్. బోల్డ్ కంటెంట్ అయినప్పటికీ.. ఏమాత్రం వల్గారిటీ లేకుండా నీట్ అండ్ క్లీన్ గా రూపొందిన ఈ సినిమాపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఈ మూవీతో సంతోష్ శోభన్ రేంజ్ కూడా పెరిగింది.
అందుకే నందినిరెడ్డి త్వరలో తీయబోయే రొమాంటిక్ లవ్ స్టోరీకి సంతోష్ శోభన్ నే హీరోగా ఫిక్స్ చేసినట్టు సమాచారం. గతంలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. ఏక్ మినీ కథతోనే సంతోష్ కు మంచి సక్సెస్ దక్కింది. దాని తర్వాత నందిని రెడ్డి లాంటి డైరెక్టర్ చేతిలో పడడం అతడి లక్కనే చెప్పాలి. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్ళబోతున్న ఈ సినిమా ఎలాంటి స్టోరీతో రూపొందబోతోందో చూడాలి.