పదులుకాదు.. వందలు కాదు ఏకంగా 50 వేల మందికి వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. మాదాపూర్ హైటెక్స్ లో మెగా వ్యాక్సినేషన్ కు వేదికగా నిలిచింది. ఇవాళ ఒక్కరోజే 50 వేల మందికి టీకాలు ఇవ్వనున్నారు. మెగా డ్రైవ్ ఉందని తెలియడంతో వ్యాక్సిన్ కోసం పెద్ద ఎత్తున జనాలు తరలివస్తున్నారు. 18 ఏళ్లు నిండిన వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు డ్రైవ్ జరగనుంది. సుమారు 500 కౌంటర్లు ఏర్పాటు చేశారు.
సైబరాబాద్ పోలీసులు, ఓ కార్పొరేట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ మెగా డ్రైవ్ జరుగుతోంది. డ్రైవ్ ప్రారంభించిన ఒక గంటలోనే దాదాపు 5 వేలమంది వేయించుకున్నట్లు అధికారుల అంచనా. కరోనా కేసులు పెరుగుతుండటం.. టీకా వేయించుకోవడానికి ప్రజలు ఇష్టం చూపుతుండటంతో పోలీస్ యంత్రాంగం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే ఒకేచోట 40 వేల నుంచి 50 వేల మందికి టీకా పంపిణీ ప్రక్రియ జరుగుతోంది.
Must Read ;- కోవిడ్ రోగులకు ఏపీ యువ పారిశ్రామిక వేత్తల ‘ఊపిరి’











