కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాక కోవిడ్ సోకిన వ్యక్తులు ఎవరూ కూడా చనిపోలేదని అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్) ప్రకటించింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక ఎవరికైనా కరోనా సోకినట్లయితే దానిని బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్షన్ అంటారని ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. దీనికి సబంధించి రెండు నెలల పాటు ఎయిమ్స్ అధ్యయనం నిర్వహించింది. అధ్యయనం నిర్వహించిన సమయంలో కరోనా సెకండ్ వేవ్ పీక్ స్టేజీలో ఉంది. రోజూ 4 లక్షల కోవిడ్ కేసులు నమోదవుతున్న సమయంలో ఈ అధ్యయనం జరిపారు. కోవిడ్ టీకా తీసుకున్న వారు ఎవరూ చనిపోలేదని ఎయిమ్స్ ప్రకటించింది.
అధ్యయనం ఇలా..
బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్షన్ సోకిన 63 కేసులను జినోమ్ సీక్వెన్సింగ్ మాధ్యమంలో ఎయిమ్స్ నిపుణులు అధ్యయనం చేశారు. వీరిలో 36 మంది రెండు టీకాలు, 27 మంది ఒక టీకా వేయించుకున్నారు. పది మంది కోవిషీల్డ్, 53 మంది కోవాగ్జిన్ తీసుకున్నవారు ఉన్నారు. వీరిలో ఎవరూ కూడా చనిపోలేదని ఎయిమ్స్ నిపుణులు తేల్చారు. టీకా తీసుకున్నాక కరోనా వచ్చిన వారిలో తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపించాయని నిపుణులు వెల్లడించారు. అధ్యయనంలో పాల్గొన్న వారి సగటు వయసు 37గా ఉండగా 21 నుంచి 92 సంవత్సరాల మధ్య వయస్కులపై ఈ అధ్యయనం జరిపారు. అధ్యయనం జరిపిన వారిలో 41 మంది పురుషులు, 22 మంది స్త్రీలు ఉన్నారని ఎయిమ్స్ ప్రకటించింది.
Must Read ;- కరోనా టీకాలనూ కొనని జగన్ సర్కారు.. ధైర్యముంటే ప్రధానిని నిలదీయాలన్న పట్టాభి











