టాలీవుడ్ లో తెరమరుగైన అందాల భామల్లో ముందు వరుసలో ఉండే సుందరి హంసా నందిని. ముగ్ధమోహన రూపం, అందాల చిరునవ్వు, ఆకర్షించే శరీర సౌష్ఠవం ఆమె ఆభరణాలు. పదిహేడేళ్ళ క్రితం టాలీవుడ్ లో కథానాయికగా పరిచయం అయింది హంస. అయితే అప్పుడు ఆమె పేరు పూనమ్. అయితే వంశీ ‘అనుమాస్పదం’ చిత్రంతో పూనమ్ పేరు హంసానందినిగా మారింది. తెలుగుతో పాటు కన్నడ, హిందీ చిత్రాల్లో సైతం నటించినప్పటికీ.. ఆమె ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చింది తెలుగు చిత్రాలకే. అయినా సరే ఆమెకి సరైన గుర్తింపు రాలేదు.
ఎక్కువగా హంసకి సెకండ్ హీరోయిన్ గానూ, వ్యాంప్ పాత్రలు, ఐటెమ్ సాంగ్స్ లో అవకాశాలు రావడంతో.. దాని మీద కూడా ఆమెకి విసుగొచ్చింది. ఆమె ఆఖరుగా నటించిన తెలుగు చిత్రం గోపీచంద్ పంతం. ఆ తర్వాత హంసా నందిని సినిమాల్లో కనిపించడం మానేసింది. ప్రస్తుతం హంస.. స్వాన్ కిచెన్ పేరిట తన యూ ట్యూబ్ చానల్ లో రకరకాల డిషెస్ వండడం , దాని మీద రివ్యూ ఇవ్వడం చేస్తోంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ షోకి హంసానందిని తన గ్లామర్ ను కూడా యాడ్ చేస్తూండడంతో ఈ షో మరింత ఆసక్తికరంగా మారింది.
ఇక హంసా నందినికి మరో వ్యాపకం ఏంటంటే.. తరచుగా తన ఇన్ స్టా ఖాతాలో హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. హంస పిక్స్ కి ఇక్కడ మంచి రెస్పాన్స్ వస్తూంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా హంసానందిని పోస్ట్ చేసిన శారీ పిక్స్ .. నెటిజెన్స్ ను భలేగా ఆకట్టుకుంటున్నాయి. కిచెన్ షో లో కనిపించిన ఈ చీరతోనే ఆమె ఫోటో షూట్ నిర్వహించి.. ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. స్కై బ్లూ శారీ విత్ ఎల్లో బ్లౌజ్ లో హంసా నందిని రాజహంసలా కనిపిస్తోంది. దీనికి ఓ రేంజ్ లో కామెంట్స్ పడుతున్నాయి.
Must Read ;- అందాల నడి‘బొడ్డు’న పూనమ్ బజ్వా