మహిళలపై దాడి చేసిన వాడి గుడ్లు పీకేలా ముఖ్యమంత్రి ఉండాలన్న జగన్‌రెడ్డి, ఈ రెండేళ్లలో ఎంతమంది గుడ్లు పీకారని టీడీపీ ఏపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. పులివెందులలో హత్యాచారానికి గురైన నాగమ్మ కేసును మరుగున పడేసినట్లే సీతానగరం గ్యాంగ్ రేప్ కేసును కూడా మరుగున పడేస్తారన్న అనుమానం కలుగుతోందని ఆమె అన్నారు. జగన్ తెచ్చిన చట్టాల్లో నిబద్ధత ఉండదని, దిశ చట్టం ద్వారా నిందితులకు శిక్ష విధించినట్లు హోమంత్రి ప్రచారం చేయటం సిగ్గు చేటని అనిత వ్యాఖ్యానించారు.
520 మంది మహిళలపై..
జగన్ రెడ్డి రెండేళ్ల పాలనలో 520పైగా మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు జరిగాయని అనిత ఆరోపించారు. ఏ మహిళకు కూడా న్యాయం చేయలేదని ఆమె అన్నారు. మరో వైపు క్యాంపు కార్యాలయానికి సమీపంలోనే యువతిపై సామూహిక అత్యాచారం జరిగినా ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేదని ప్రతిపక్ష టీడీపీ విమర్శిస్తోంది.
నిందితులను వైసీపీ నేతలే కాపాడుతున్నారు
నిందితులను వైసీపీ నేతలే కాపాడుతున్నారని అనిత ఆరోపించారు. వారికి ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, వసంత కృష్ణప్రసాద్ అండగా ఉన్నారని, అందుకే కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో ఈ దారుణ ఘటన జరిగినా ఎమ్మెల్యే ఆర్కే ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె ప్రశ్నించారు.
Must Read ;- రాంకీలో ఐటీ రైడ్స్.. వైసీపీ ఎంపీ బుక్కయ్యారా?











