IT Attacks on Ramky Office :
వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రాంరెడ్డికి చెందిన రాంకీ సంస్థలపై ఐటీ కన్ను పడింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాంకీ ప్రధాన కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ సోదాలు జరిపారు. సంస్థలతోపాటు ఎంపీ ఇంట్లో కూడా సోదాలు జరగడం సంచలనం రేపుతోంది.
కీలక ప్రతాలు స్వాధీనం
రాంకీ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. దీనికి చైర్మన్‌గా అయోధ్య రాంరెడ్డి కొనసాగుతున్నారు. అయితే కంపెనీ జరిపిన అమ్మకాలు, కొనుగోళ్లలో తేడాలున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. కంపెనీ చెల్లించిన అడ్వాన్స్ టాక్స్ వివరాలను ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పలు లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ రిటర్స్ విషయంలో కంపెనీ ఎంత సొమ్మును ఎగొట్టింది? ఎలాంటి అవకతవకలకు పాల్పడింది? అనే కోణంలో ఐటీ ఆరా తీస్తోంది. ఈ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఒకేసారి 15 చోట్లా ఐటీ శాఖ సోదాలు జరపడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
సీఎం జగన్ కు సన్నిహితుడు
ఆళ్ల ఆయోధ్య ఏపీ సీఎం జగన్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడు. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి సోదరుడు. గతంలో వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అందుకే వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారని పార్టీ వర్గాల సమాచారం కూడా. అయితే ఒకేసారి రాంకీ సంస్థలపై దాడులు కొనసాగడంతో.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల్లో తీవ్ర టెన్షన్ నెలకొంది. ఐటీ దాడుల్లో అయోధ్య బుక్ అయితే.. నెక్ట్స్ టార్గెట్ ఎవరో అంటూ భయాందోళనకు గురవుతున్నారు.
Must Read ;- సీఎంగారూ.. సజ్జల సంగతేంటి?