నిధులు సున్న .. అభివృద్ధి శూన్యం !
దేశానికి పల్లెలు పట్టుకొమ్మలు అని ఊరికే చెప్పలేదు పెద్దలు… ఈ మాట ఆర్థికంగానే కాదు .. రాజకీయంగా కూడా వర్తిస్తోంది! రూరల్ బెస్ లో పార్టీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత బెటర్ అని రాజకీయపార్టీలు భావించడం సహజం. గత తొమ్మిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండి .. సామాజీకంగా, ఆర్థికంగా చితికిన వైసీపీ కేడర్ కు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఊరట లేదు. నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలకు గోడు విన్నవించుకోవాలని వెళ్తే … ఆయన పరిస్థితి ఏంటో ఆయనకే అర్థకాని దుస్థితి. పంచాయితీలకు రావాల్సిన నిధులు లాగేసుకుంటున్నారు. ప్రశ్నించి వారిని టార్గెట్ చేసి సొంతవారని కూడా చూడకుండా హింసపెట్టి వేధిస్తున్నారు. నమ్మి రెండు చేతుల్తో ఓట్లేపించిన కార్యకర్తలకు, నాయకులకు నేడు గ్రామాల్లో తీవ్ర అవమానాలను ఎదుర్కొంటున్నారు. మచ్చుకైనా అభివృద్ధి లేక తలెత్తుకు తిరగలేని పరిస్థితి ఆ నాయకులది. నోటి హామీలు నిధులను సమకూర్చలేవని తత్వం బోధపడి .. అధికార పార్టీని వీడి టీడీపీకి వలస కడుతున్నారు. ఇది ఉత్తరాంధ్ర నుంచి మొదలుకావడం తెలుగు దేశానికి శుభసూచికం.
ముందు కార్యకర్తల వరుస .. ఆ తరువాత నేతల వంతు!
ప్రజాసేవలో భాగమే రాజకీయం. పాలి‘ట్రిక్స్’ను ప్లే చేసైనా సరే ప్రజలను, సొంతపార్టీని వారిని కాపాడుకోవాలి. అది నాయకుడు పాటించే ప్రాథమిక సూత్రం. అధికార పార్టీ రాష్ట్రంలో పాలన ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలు చేసిన మాదిరిగా … రాష్ట్రాన్ని కూడా మూడు భాగాలుగా విభజించి పెత్తనం ఆ ముగ్గురికి అప్పగించారు. వీరిలో ఇద్దరు మాత్రం జీతగాళ్ళు. వీరికి మాస్ తో కనెక్టవ్వడం, గ్రాస్ రూట్లో సమస్యల మూలాలను వెతికి పరిష్కరించడం ఎమ్మెల్యే స్థాయి నుంచి కార్యకర్త వరకు వారు కోరుకునేది ఏమిటి? వారిని ప్రజలకు ఎలా చేరువ చేయాలని అన్న కాన్సెప్ట్ వీరిలో వీసమెత్తు కూడా లేదన్నది సొంతపార్టీ వారి నుంచి వినిపిస్తున్న ఆరోపణలే. ఎప్పుడు వ్యాపారం ..వ్యాపారం .. అంటూ సొంత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యతనిస్తూ సమస్త ఆదాయం ఊడ్చేశారు. అంతేకాక సీనియర్ ఎమ్మెల్యే, మంత్రులను సైతం పక్కనపెట్టి.. వారి నిర్ణయాలకు, సలహాలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ఫలితంగా నియోజకవర్గం స్థాయి కేడర్లోనే మార్పు మొదలైంది. ముందు సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థాయి నాయకులను పార్టీ వీడేలా చేసి .. ఆ తరువాత తనవంతుగా పార్టీ మారాలని అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు. అందులో భాగమే శ్రీకాకుళం జిల్లా రేగడి మండలం శిర్లం పంచాయతీలో వైసీపీకి చెందని 500 కుటుంబాలు పెద్దఎత్తున ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకున్నారు.
దూకుడు పెంచిన టీడీపీ ..
అధికారపార్టీ నుంచి వలసలు టీడీపీలోకి వరదలా వచ్చిపడుతోంది. దీంతో గతంలో టీడీపీని వీడి, అవకాశవాద రాజకీయాలకు ప్రాధాన్యతిచ్చి వైసీపీ బాటపట్టిన వారిని పార్టీలో చేర్చుకునే ప్రశక్తి లేదని అధినేత చంద్రబాబు ఇప్పటికే తేల్చిచెప్పారు. మొన్న కడప జిల్లా, జమ్మలమడుగు నుంచి సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, తనయుడు భూపేష్ టీడీపీలో చేరిన విషయం విధితమే. ఆ తరువాత శ్రీకాకుళం శిర్లం పంచాయితీ నుంచి 500 కుటుంబాలు ఒక్కపట్టున అధికారపార్టీని వీడి టీడీపీలోకి చేరారు. ఇలా పార్టీలోకి వలస క్రమం పెరుగుతుండడంతో టీడీపీ కూడా దూకుడు పెంచింది. గ్రామ, పట్టణ స్థాయిలో ‘గౌరవసభలు’నిర్వహించాలని భావిస్తోంది. అసెంబ్లీ వేదికగా తిష్ట వేసిన కౌరవ సభలో ఏం సాధించలేమని గ్రహించిన టీడీపీ .. ప్రజా సమస్యలపై నేరుగా క్షేత్రస్థాయిలోనే పోరాటం సాగిద్దామని ‘గౌరవ సభలు’ పేరుతో కార్యచరణకు టీడీపీ సిద్ధమౌతోంది. పూర్తిస్థాయి యాక్షన్ ప్లాన్ తో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని టీడీపీ దూకుడుగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
Must Read ;- జగన్‌పై కడప సర్పంచ్‌లే తిరుగుబాటు.. మూకుమ్మడి రాజీనామాలు!











