అనాధల కోసం ఆశ్రమాలు
అనాధలను ఆదరిస్తున్నామంటూ ప్రచారం బాగా నిర్వహిస్తారు. నమ్మించడానికి ముందుగా కొందరికి సహయం కూడా చేస్తారు. వీటిని నమ్మి ఎందరో వారికి ఆర్థికంగా సహకరించడం మొదలుపెడతారు. అలా విదేశాల నుండి కూడా విరాళాలు రావడం మొదలయ్యాక వారి అసలు రంగు బయటపడుతుంది. వస్తున్న విరాళాలతో పోల్చుకుంటే పిల్లల సంక్షేమానికి 10 శాతం కూడా కేటాయించకుండా నిధులను తమ ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. ఒక్కొక్క చిన్నారి సంరక్షణకు వారు అందుకుంటోంది లక్షల్లో… కానీ ఖర్చుపెడుతున్నది కేవలం వేలల్లో…
ఆంధ్రప్రదేశ్ దే అగ్రస్థానం
అభివృద్ధిలో అగ్రస్థానం అంటే వినసోంపుగా ఉంటుంది. కానీ, మోసం చేయడంలో, నిధులను స్వాహా చేయడంలో టాప్ లో ఉన్నామని వినడానికి ఏ రాష్ట్ర ప్రజలకైనా చాలా ఇబ్బందిగా ఉంటుంది. పిల్లల సంక్షేమ నిధులను స్వాహా చేయడంలో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానాన నిలిచిందని వినాల్సిరావడం దురదృష్టకరం. దీనికి సంబంధించి జాతీయ బాలల హక్కుల కమిషన్ స్పష్టమైన లెక్కలను వెల్లడించింది. ఐదు రాష్ట్రాలలో చేసిన అధ్యయన వివరాల ప్రకారం ఏపిలో ఒక్కో చిన్నారి సంరక్షణకు అందుకుంటున్న మొత్తం దాదాపు 6.6 లక్షలు, కానీ ఎన్జీవో సంస్ధలు ఒక్కో చిన్నారి కోసం ఏడాదికి ఖర్చుపెడుతున్నది 60 వేలు కూడా దాదాటం లేదు. తరవాతి స్థానంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ నిలిచాయి.
నియంత్రణ అవసరం
ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే మనసు ఉండడంలో తప్పులేదు. అందుకోసం ఒక సంస్థను నిర్వహించడం కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ, వారు నిజంగానే సహాయం చేయడానికి పూనుకున్నారా లేక సహయం ముసుగులో నిధులను స్వాహా చేయాలని చేస్తున్నారా అనేది గుర్తించగలిగితే ఇటువంటి అక్రమాలను అరికట్టవచ్చు. ఇలాంటి కొందరి వల్ల నిజంగా మంచి మనసుతో సహాయం చేస్తోన్న వారికి చెడ్డపేరు వస్తుంది.
Must Read ;- ప‘రేషన్’: ఒక రేషన్ కు రెండు వేలి ముద్రలేందన్నా?