తత్వం బోధపడే సంఘీభావమా?
దేశానికి రైతు వెన్నెముక. ఆ వెన్నెముకను విరవాలని చూసిన ఏ ప్రభుత్వం దేశంలో మనుగడ సాగించిన దాఖాలు లేవు. అది తెలుసుకుని మొన్న ప్రధాని నరేంద్ర మోదీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి .. రైతులకు క్షమాపణలు చెప్పారు. ఏపీలో కూడా రాజధాని విభజనను వ్యతిరేకిస్తూ .. గత రెండేళ్ల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు రైతులు. జగన్ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించి ఏపీకి రాజధాని అమరావతే ఒక్కటే ఉండాలని భీష్మించి, ఎంతో పట్టుదలతో ఉద్యమాలు, నిరసనలు చేపట్టారు. ‘న్యాయంస్ధానం టూ దేవస్థానం’ పేరుతో అమరావతి జేఏసీ, రైత సంఘాలు, రైతులు తలపెట్టిన మహాపాదయాత్రకు రాష్ట్రంలో అనూహ్యంగా అన్ని వర్గాల నుంచి మద్దుతును కూడకట్టుకుంది. తెలుగుదేశంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు రైతు పాదయాత్ర కు మద్దతు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో సాగుతున్న పాదయాత్రలో రైతులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా .. ముందుకు కదులుతున్నారు.
రైతులకు సంఘీభావం తెలిపిన అధికారపార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి!
29వ రోజులుగా కొనసాగుతున్న మహాపాదయాత్ర నెల్లూరు రూరల్ పరిధిలో ప్రస్తుతం సాగుతోంది. ఈ నేపథ్యంలో మహాపాదయాత్ర శిబిరంలో ఉన్న రైతులను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిసి సంఘీభావం ప్రకటించారు. రైతులకు మద్దతు తెలుపుతూ .. రైతులతో, మహిళలతో ముచ్చటించారు. ఏ ఇబ్బంది వచ్చినా తనను సంప్రదించాలని రైతులకు మాటిచ్చారు. ఇలా శ్రీధర్ రెడ్డి రైతులను కలిసి వారికి మద్దతునివ్వడంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే రైతులకు సంఘీభావం తెలపడం ఆయన వ్యక్తిగతమా? లేక పార్టీ ఆదేశాల మేరకే శ్రీధర్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేశారా? అన్నది తెలిసిరావాల్సి ఉంది.
Must Read ;- నెల్లూరు సింహాలు తోకముడిచాయేం?











