సంబరాల్లో భూమా ఫ్యామిలీ..!
టీడీపీ నేత మాజీ మంత్రి అఖిలప్రియ గురువారం పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో భూమా ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ విషయాన్ని భర్త భార్గవ్ రామ్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అఖిలప్రియ తన బిడ్డ తో ఉన్న ఫోటోను షేర్ చేసి తనకు మగ బిడ్డ పుట్టిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇందులో ఇంకో విశేషం కూడా ఉంది. ఈ రోజే భూమా అఖిల ప్రియ తల్లి శోభానాగిరెడ్డి జయంతి కూడా. ఈ రోజునే అఖిలప్రియ కుమారుడికి జన్మనివ్వడంతో భూమా నాగిరెడ్డి మళ్ళీ ఇలా పుట్టారంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. భూమా అఖిలప్రియ మంత్రిగా ఉన్న సమయంలోనే వివాహం చేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూమా కుటుంబాన్ని అనేక కేసుల్లో ఇరికించి వేధింపులకు గురిచేశారు. అన్ని వివాదాలను,పెట్టిన కేసులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ అఖిలప్రియ ఎంతో దైర్యంగా ముందుకు సాగుతుంది.
Must Read ;- రాష్ట్రంలో దుష్టపాలన అంతానికే టీడీపీలోకి వలసల యాగం..!











