శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కొనసాగుతున్న వలసలు..!
రాష్ట్రంలో దుష్టపాలన అంతానికి తెలుగుదేశం పార్టీలో వలస యగ్నం జరుగుతోంది. యగ్నంలో భాగంగా వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు, నాయకులు ముందుకు వచ్చి పార్టీ కండువా కప్పుకుని భాగస్వాములవుతున్నారు. రాజకీయ పార్టీ నేతలే కాకుండా, ప్రముఖులు, మాజీ ఐపీఎస్ అధికారులు పెద్ద సంఖ్యలో పార్టీలోకి వచ్చి చేరుతున్నారు. గడిచిన రెండు నెలల్లో టీడీపీలోకి పెద్ద సంఖ్యలో వలసలు పెరిగాయి. అధికారపార్టీకి చెందిన అసంతృప్తి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరిపోతున్నారు. బుధవారం రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శేక్షావలి టీడీపీ తీర్థ పుచ్చుకున్నారు. చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకుని, పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఆయనతోపాటు నూర్ భాషా వర్గానికి చెందని పలువురు నేతలు కూడా పార్టీ కండువా కప్పుకున్నారు. పెద్ద ఎత్తున పార్టీలోకి చేరుతున్న వారిని చంద్రబాబు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కొద్ది రోజుల క్రితం జమ్మమడుగు నుంచి సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఆయన తనయుడు భూపేష్ రెడ్డి లు టీడీపీలో చేరారు. మరో వైపు శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల నుంచి వందలాది కుటుంబాలు అధికారపార్టీని వీడి టీడీపీలోకి వలస వచ్చారు.
మూడు టాయిలెట్స్ కట్టిచూపు .. అప్పుడు నమ్ముతా..!
రాష్ట్రంలో రెండునరేళ్ల వైసీపీ పాలనలో కనీసం మూడు టాయిలెట్స్ కూడా కట్టలేదు. గతంలో మరుగు దోడ్లకు కేంద్రం ప్రత్యేక నిధులిస్తే, వాటికి రాష్ట వాటను కలుపుకుని పల్లె, పట్టణాల్లో మరుగు దోడ్లు నిర్మించడం ఎప్పటి నుంచో వస్తున్నది. అటువంటిది జగన్ రెడ్డి పాలనలో పెద్దఎత్తున ఎన్ఆర్జీఎస్ నిధులు దుర్వినియోగమయ్యాయి. అభివృద్ధి పథకాల నిధులను సంక్షోభ పథకాల్లో కుమ్మరించి, రాష్ట్రాన్ని జగన్ రెడ్డి అధోగతి పాలు చేశారు. రాష్ట్రంలో సాగుతున్నఈ విధ్వంసకర పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. మూడు మరుగు దోడ్లనే కట్టలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులను ఎలా కడుతారని ప్రశ్నించారు. ఆర్థిక కష్టాల నుంచి కాపాడాలని ఢిల్లీలో బిచ్చమెత్తుకుంటున్న పరిస్థితులను ప్రజలు గమనిస్తునే ఉన్నారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులను కేంద్రం నుంచి సాధించలేక చేతులెత్తేసి .. కేంద్రం వద్ద మోకరిల్లుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Must Read ;- పోలవరంపై నన్ను ప్రశ్నించొద్దు..! ఏం పీక్కుంటారో పీక్కొండి!!











